తలరాత తలకిందులైతే?
లేడీ సూపర్ స్టార్ నయనతార మొయిన్ లీడ్‌గా, తమిళ్, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఐరా మూవీ టీజర్ రిలీజ్

లేడీ సూపర్ స్టార్ నయనతార మొయిన్ లీడ్‌గా, తమిళ్, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఐరా మూవీ టీజర్ రిలీజ్
లేడీ సూపర్ స్టార్ నయనతార మొయిన్ లీడ్‌గా, తమిళ్, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్నసినిమా, ఐరా.. నయనతార ఈ సినిమాలో డ్యుయెల్ రోల్ చేస్తుంది. రీసెంట్‌గా ఐరా తెలుగు, తమిళ్ టీజర్స్ రిలీజ్ చేసారు మేకర్స్. టీజర్‌లో నయనతార రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనబడుతుంది. మళ్ళీ ఆడపిల్లే పుట్టిందిరా అని ఒక పెద్దావిడ అనగానే, అయ్యో, ఆడపిల్లా? అంటూ ఒక వ్యక్తి బాధపడడంతో ఐరా టీజర్ మొదలైంది. నాకే తెలియని ఎవరో ఆరుగురు నాతల రాతని తలకిందులుగా రాసారు. అని చెప్తూ నయనతార భయపడుతుంది.
అందరికీ సంతోషంగా బతకడం ఒక కల. కానీ, జీవితంలో సంతోషం అంటే ఏంటో తెలియని నాకు, బతకడమే ఒక కల అనే డైలాగ్స్‌తో, విజువల్స్‌తో సింపుల్‌గా కథ చెప్పే ప్రయత్నం చేసినట్టు అనిపిస్తుంది. టీజర్‌లో పల్లెటూరి గృహిణిగా, మోడరన్ యువతిగా కనిపించిన నయనతార, నటనపరంగా ఆకట్టుకుంది. సుదర్శన్ శ్రీనివాసన్ ఫోటోగ్రఫీ, కెఎస్ సుందరమూర్తి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌లో హైలెట్ అయ్యాయి. కలైయరసన్, యోగిబాబు తదితరులు నటిస్తున్న ఐరా సినిమాకి, కథ, స్ర్కీన్ ప్లే : ప్రియాంక రవీంద్రన్, డైలాగ్స్ : శశాంక్ వెన్నెలకంటి, లిరిక్స్ : రాకేందు మౌళి, ఎడిటింగ్ : కార్తీక్ జోగేష్. దర్శకత్వం : సర్జున్ కెఎమ్.
వాచ్ టీజర్…