ప్రియుడితో కలిసి ఆలయాల దర్శనం : నయనతార దీక్ష ప్రారంభం

లేడీ సూపర్‌స్టార్ నయనతార తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి ప్రముఖ ఆలయాను సందర్శించి తన దీక్షను ప్రారంభించారు..

  • Published By: sekhar ,Published On : December 11, 2019 / 09:25 AM IST
ప్రియుడితో కలిసి ఆలయాల దర్శనం : నయనతార దీక్ష ప్రారంభం

Updated On : December 11, 2019 / 9:25 AM IST

లేడీ సూపర్‌స్టార్ నయనతార తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి ప్రముఖ ఆలయాను సందర్శించి తన దీక్షను ప్రారంభించారు..

దక్షిణాది టాప్ హీరోయిన్, లేడీ సూపర్‌స్టార్ నయనతార తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి ప్రముఖ ఆలయాల సందర్శనకు వెళ్లింది. కన్యాకుమారిలోని భగవతి అమ్మన్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసింది. దీనికి ప్రత్యేక కారణం నయన్ ప్రస్తుతం చేస్తున్న ఒక దీక్షే. హాస్య నటుడు, హీరో ఆర్జే బాలాజీ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం `మూక్కుత్తి అమ్మన్`. ఈ సినిమాలో నయన్ అమ్మవారి పాత్రలో నటిస్తోంది.

Nayanthara and Vignesh Shivan

ఈ సినిమాలో నటించినన్ని రోజులూ మాంసాహారాన్ని ముట్టుకోనని నయన్ దీక్ష చేపట్టిందట. ఈ విషయాన్ని బాలాజీ కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. అయితే బాలాజీ నుంచి ప్రకటన వచ్చిన సమయంలో నయన్ తన ప్రియుడితో కలిసి విదేశాలకు విహార యాత్రకు వెళ్లింది. దీంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

`నయన్ చేస్తున్న దీక్ష ఇదేనా` అంటూ పలువురు ట్రోలింగ్ చేశారు. అయితే ఈ సినిమా చిత్రీకరణలో నయన్ మంగళవారం నుంచే పాల్గొంటోంది. చిత్రీకరణకు హాజరయ్యే ముందు విఘ్నేష్‌తో కలిసి అమ్మవారు మరియు మురుగన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి నయన్ దీక్షను ప్రారంభించడం విశేషం.