ఏళ్లు గడుస్తున్నా గ్రేస్ తగ్గట్లేదు: అమ్మవారి గెటప్‌లో నయనతార

  • Published By: vamsi ,Published On : March 1, 2020 / 05:15 AM IST
ఏళ్లు గడుస్తున్నా గ్రేస్ తగ్గట్లేదు: అమ్మవారి గెటప్‌లో నయనతార

Updated On : March 1, 2020 / 5:15 AM IST

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 17ఏళ్లు గడుస్తున్నా కూడా ఇంకా ఏ మాత్రం క్రేజ్ తగ్గని దక్షిణాది హీరోయిన్ అంటే నయనతార మాత్రమే. దక్షిణాది స్టార్ హీరోలు అందరితోనూ దాదాపుగా నటించేసింది ఈ అమ్మడు.. అంతేనా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ ఈ భామ ఎంటర్ టైన్ చేస్తుంది. కెరీర్ ఆరంభంలో మలయాళంలో ఓ టీవీ షోలో యాంకరింగ్ చేసి క్రేజ్ తెచ్చుకున్న నయన్.. ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్న తేడా లేకుండా ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ సినిమాలు చేస్తుంది.

ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ… తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నయన్.. లేటెస్ట్‌గా తమిళ సినిమా మూకుత్తి అమ్మన్  సినిమాలో అమ్మవారి గెటప్లో దర్శనం ఇచ్చింది నయనతార. ఈ సినిమాలో నయనతార ఫస్ట్ లుక్‌ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో నయనతార అమ్మవారి రూపంలో కనిపించగా.. ఆర్.జే బాలాజీ, ఎన్జే  శరవణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

తమిళ్‌లో ‘అరం’, ‘డోరా’, ‘కోలమావు కోకిల’, ‘ఐరా’, ‘కొలైయుదిర్‌కాలం’… వంటి హీరోయిన్ ఓరియెంటెడ్  సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును, ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని లేటెస్ట్‌గా విడుదలైన లుక్‌లో అమ్మవారిలో అధ్భుతంగా కనిపించింది.  ఈ లుక్  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటి వరకు విభిన్న పాత్రల్లో నటించిన నయనతార అమ్మవారి పాత్రలో కనిపించలేదు. తొలిసారి ఇటువంటి లుక్‌లో నయన్ కనిపించింది.