NBK 107 : బాలయ్య సినిమా టైటిల్.. గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్న NBK 107 టీం..
ఈ సినిమా టైటిల్ ని అక్టోబర్ 21న ప్రకటిస్తామని తెలిపారు చిత్రయూనిట్. ఇప్పటికే పలు టైటిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్. ఎన్నడూ లేని విధంగా ఒక సినిమా టైటిల్ ని గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు...................

NBK 107 Title Announcement grand launch event in Kurnool
NBK 107 : బాలకృష్ణ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 107 సినిమా తెరకెక్కుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ రిలీజయి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.
ఇటీవల ఈ సినిమా టైటిల్ ని అక్టోబర్ 21న ప్రకటిస్తామని తెలిపారు చిత్రయూనిట్. ఇప్పటికే పలు టైటిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్. ఎన్నడూ లేని విధంగా ఒక సినిమా టైటిల్ ని గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు.
బాలయ్య 107వ సినిమా టైటిల్ ని కర్నూల్ లోని కొండారెడ్డి బురుజు వద్ద అభిమానుల మధ్య అక్టోబర్ 21వ తేదీ రాత్రి 8:15 గంటలకు గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ లో బాలయ్య బాబు, శృతి హాసన్, దర్శకుడు గోపీచంద్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అఖండ సినిమా హిట్ అవ్వడం, అన్ స్టాపబుల్ షోకి బాగా రీచ్ రావడం, ఆల్రెడీ NBK 107 టీజర్ వైరల్ అవ్వడంతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు బాలయ్య బాబు. అభిమానులు కూడా అదే జోష్ లో ఉన్నారు. ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు.