Kaliyugam Pattanamlo : ‘కలియుగం పట్టణంలో’ నుంచి ‘నీ వలనే పెదవిపై..’ మెలోడీ పాట విన్నారా?
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కలియుగం పట్టణంలో’ సినిమా నుంచి 'నీ వలనే పెదవిపై.. అంటూ సాగే మంచి మెలోడీ పాటని విడుదల చేశారు.

Neevalane Lyrical song released from Kaliyugam Pattanamlo movie
Kaliyugam Pattanamlo : విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ బ్యానర్స్ పై డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌ల నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘కలియుగం పట్టణంలో’. ఈ సినిమాలో హీరోయిన్ చిత్రాశుక్ల ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మంచి మెలోడీ పాటని విడుదల చేశారు. ‘నీ వలనే పెదవిపై.. అంటూ సాగే మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ పాటని భాస్కరభట్ల రాయగా అజయ్ అరసాద సంగీత దర్శకత్వంలో MM మానసీ ఆలపించారు. ఇక ఈ కలియుగ పట్టణంలో సినిమా మార్చ్ 22న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.
Also read : Akash Puri : RC ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇస్తున్నా అంటున్న ఆకాష్ పూరి..