Peddi: డిజిటల్ రికార్డులు తిరగరాస్తున్న ‘పెద్ది’.. నెట్‌ఫ్లిక్స్ చరిత్రలో సరికొత్త రికార్డు.. గ్లోబల్ స్టార్ క్రేజ్ అంటే ఇదే
రామ్ చరణ్ పెద్ది(Peddi) సినిమా ఓటీటీ రైట్స్ కోసం రూ.130 కోట్లకు పైగా ఆఫర్ చేసిన నెట్‌ఫ్లిక్స్.
Netflix Offers 130 Crore for Peddi OTT Rights
- పెద్ది సినిమా కోసం నెట్‌ఫ్లిక్స్ భారీ ఆఫర్
- విడుదలకు ముందే రూ.1300 కోట్ల డీల్
- హిట్ అయితే మరో రూ.20 కోట్లు
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది(Peddi)’ చిత్రం బాక్సాఫీస్ వద్దకు రాకముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ. 130 కోట్లు ఆఫర్ చేసినట్టు సమాచారం. తెలుగుతో పాటు ఐదు భాషలకు కలిపి కుదిరిన ఈ భారీ ఒప్పందం, రామ్ చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న క్రేజ్‌ను మరోసారి ప్రూవ్ చేసింది. కేవలం డిజిటల్ రైట్స్ ద్వారానే ఇంతటి భారీ మొత్తం రావడం టాలీవుడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Rakasa: రాకాస మూవీ సెట్స్ నుంచి స్పెషల్ ఫొటోస్.. షేర్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్
ఈ ఒప్పందంలో ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, సినిమా సాధించే విజయాన్ని బట్టి నెట్‌ఫ్లిక్స్ అదనంగా రూ. 20 కోట్ల బోనస్‌ను కూడా ఆఫర్ చేసింది. అంటే థియేటర్లలో ‘పెద్ది’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే, మొత్తం ఓటీటీ డీల్ విలువ రూ. 150 కోట్లకు చేరుతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించాయి.
గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ డ్రామాలో రామ్ చరణ్ పెద్ది పహిల్వాన్‌గా, క్రికెటర్‌గా రెండు విభిన్నమైన షేడ్స్‌లో కనిపించబోతున్నారు. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం, థియేటర్లలో సందడి చేసిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చరణ్ బాడీ లాంగ్వేజ్, బుచ్చిబాబు మేకింగ్ స్టైల్ ఈ సినిమాను ఒక విజువల్ వండర్‌గా మారుస్తాయని అభిమానులు ధీమాగా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ భారీ డీల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
