Bheemla Nayak : తమన్‌.. మళ్లీ మోసం చేశావంటూ ట్రోల్స్‌!

స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా భీమ్లానాయక్ మూవీ నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ వీడియోను విడుదల చేశారు మేకర్స్‌.

Bheemla Nayak : తమన్‌.. మళ్లీ మోసం చేశావంటూ ట్రోల్స్‌!

Bheemla Nayak

Updated On : August 15, 2021 / 5:57 PM IST

Bheemla Nayak : సంగీత దర్శకుడు తమన్ కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ‘భీమ్లా నాయక్‌’ ఫస్ట్‌ గ్లింప్స్‌ వీడియోను విడుదల చేశారు మేకర్స్‌. ఈ వీడియోకు మంచి స్పందన వస్తుంది. విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఇదంతా బాగానే ఉంది కానీ ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదలైన కాసేపటికే నెటిజన్లు తమన్‌ను ట్రోల్‌ చేయడం ప్రారంభించారు.

తమన్ మ్యూజిక్ కాపీ చేశాడంటూ నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫైటింగ్ బ్యాగ్రౌండ్‌లో ఓ బిట్‌ సూపర్ స్టార్ రజినీకాంత్ ‘పేటా’ మూవీలోని ఓ పాట మ్యూజిక్‌ను పోలి ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతంలో కూడా పలుసార్లు తమన్ మ్యూజిక్ కాపీ కొట్టడంతో విమర్శలు వచ్చాయి. ‘వి’ మూవీ సమయంలో మ్యూజిక్‌​ కాపీ కొట్టాడంటూ విమర్శలు ఎదుర్కొన్నారు తమన్. అయితే వాటిపై తమన్ ఇప్పటి వరకు స్పందించలేదు.

కాగా మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ రీమేక్ మూవీనే ఈ ‘భీమ్లా నాయక్’. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ చిత్రంలో బీజు మేనన్‌ పోషించిన పాత్రను తెలుగులో పవన్‌, పృథ్వీరాజ్‌కుమార్‌ పోషించిన పాత్రలో రానా కనిపించనున్నాడు. ఇక నిత్యామీనన్‌, ఐశ్వర్యా రాజేశ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.