Maa Ramudu Andarivadu : ‘మా రాముడు అందరివాడు’ టీజర్ రిలీజ్..

Maa Ramudu Andarivadu

Maa Ramudu Andarivadu : ‘మా రాముడు అందరివాడు’ టీజర్ రిలీజ్..

Maa Ramudu Andarivadu

Updated On : November 17, 2025 / 7:38 PM IST

Maa Ramudu Andarivadu : శ్రీరామ్, స్వాతి జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘మా రాముడు అందరివాడు’. అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మాణంలో యద్దనపూడి మైకిల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్, ఆనంద్ భారతి, జబర్దస్ అప్పారావు, చిట్టి బాబు, గడ్డం నవీన్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.(Maa Ramudu Andarivadu)

తాజాగా ఈ సినిమా టీజర్, ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. తనికెళ్ళ భరణి వాయిస్ ఓవర్ తో రామాయణంను లింక్ చేస్తూ చెప్పిన ఈ మా రాముడు అందరి వాడు సినిమా టీజర్ మీరు కూడా చూసేయండి..

 

Also Read : Premante Trailer : ‘ప్రేమంటే’ ట్రైలర్ వచ్చేసింది.. కానిస్టేబుల్ గా యాంకర్ సుమ..

టీజర్ లాంచ్ ఈవెంట్లో నటుడు బాబు మోహన్ మాట్లాడుతూ.. మంచి టైటిల్ తో ప్రేక్షకుల ముందు రావడం గొప్ప విషయం. ఈ సినిమాను బాగా ప్రమోట్ చేయాలి. నిర్మాత లక్ష్మణ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ సినిమాలో గద్దర్ నరసన్న పాట పాడటం ప్రత్యేకం అని అన్నారు. దర్శకుడు మైకిల్ మాట్లాడుతూ.. ఈ సినిమాలోని 4 పాటలు నేనే రాసాను. ఈ విషయంలో గర్వపడుతున్నాను. శ్రీరామ్ ఈ సినిమాకు నాంది పలికారు. చాలా కష్టపడి చిన్న స్థాయి నుండి హీరో స్థాయికి వచ్చారు అని అన్నారు.

నిర్మాత లక్ష్మణ్ రావు మాట్లాడుతూ.. ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీరామ్, నటి స్వాతి అందరూ బాగా నటించారు. మైకిల్ తన ప్రాణం పెట్టి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు . త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తాము అన్నారు. హీరో శ్రీరామ్ మాట్లాడుతూ.. ఈ సినిమా నాతోనే మొదలైంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఇప్పటికే చాలా సినిమాలు చేశాను. మా సినిమాను 5 భాషలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము అని అన్నారు.

Also Read : I Bomma : పోలీస్ కస్టడీలో ఐ బొమ్మ హెడ్.. బిగ్ ట్విస్ట్.. ఐ బొమ్మ సైట్ నుంచి మెసేజ్.. ఏముందంటే..