బాలల హక్కుల సంఘం పిటిషన్ : భానుప్రియను అరెస్టు చేయండి

  • Published By: madhu ,Published On : February 2, 2019 / 07:43 AM IST
బాలల హక్కుల సంఘం పిటిషన్ : భానుప్రియను అరెస్టు చేయండి

Updated On : February 2, 2019 / 7:43 AM IST

చెన్నై : సినీ నటి భానుప్రియకు కష్టాలు తప్పవా ? ఆమెను పక్కా అరెస్టు చేస్తారనే వార్త హల్ చల్ చేస్తోంది. భానుప్రియ ఇంట్లో పనిచేస్తున్న బాలిక సంధ్య, ఆమె తల్లి ప్రభావతిని దొంగతనం కేసులో అరెస్టు చేయడం కొత్త మలుపు చోటు చేసుకున్నట్లైంది. దీనిని బాలల హక్కుల సంఘం తీవ్రంగా పరిగణిస్తోంది. వారిని ఎలా అరెస్టు చేస్తారు ? అసలు అరెస్టు చేయాల్సింది భానుప్రియను అంటూ బాలల హక్కుల సంఘం పేర్కొంటోంది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌లో ఫిబ్రవరి 02వ తేదీ బాలల హక్కుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఏపీ డీజీపీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. 

అక్రమ రవాణా..లైంగిక ఆరోపణలు…ఛైల్డ్ లేబర్ యాక్టు కింద భానుప్రియను అరెస్టు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు బాలల హక్కుల సంఘం నేతలు పేర్కొంటున్నారు. 
14 ఏళ్ల మైనర్ బాలికను పనిలో పెట్టుకోవడం పెద్ద నేరమని…లైంగికంగా వేధించారంటూ వస్తున్న ఆరోపణలు నిజమైతే మాత్రం భానుప్రియకు కష్టాలు తప్పవని పలువురు పేర్కొంటున్నారు. 

సామర్లకోట మండలం, పండ్రవాడ విలేజ్‌కు చెందిన ప్రభావతి కుమార్తె సంధ్య భానుప్రియ ఇంట్లో పనిచేస్తోంది. అయితే..సంధ్యను వేధిస్తున్నారని..భానుప్రియ సోదరుడు లైంగికంగా వేధిస్తున్నారని…తన కుమార్తె దొంగతనం కేసు పెడుతామని బెదిరిస్తున్నరంటూ..తల్లి ప్రభావతి పోలీసులకు కంప్లైట్ చేసింది. దీనిపై భానుప్రియ స్పందించారు. తన ఇంట్లో దొంగతనం చేసిందని..తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో చోరీ చేసిన వస్తువులను తెచ్చిచ్చి..తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమని నటి భానుప్రియ చెప్పారు. దీనిపై బాలిక కూడా మీడియాతో మాట్లాడింది. తల్లి దొంగతనం చేసిందని పేర్కొంది. 

తాజాగా వీరిద్దరినీ అరెస్టు చేయడం కలకలం రేపుతోంది. పనిచేసే అమ్మాయి..బాలిక అయితే మాత్రం భానుప్రియకు చిక్కులు తప్పవని తెలుస్తోంది. ఎందుకంటే ఛైల్డ్ పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. బాల కార్మిక చట్టం ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష, రూ. 50వేల జరిమాన పడే అవకాశం ఉంది.