నా పేరు నంద గోపాల కృష్ణ..
తమిళ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ శ్రీ రాఘవ కాంబినేషన్‌లో రూపొందుతున్నఎన్‌జీకే (తెలుగు) టీజర్ రిలీజ్..

తమిళ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ శ్రీ రాఘవ కాంబినేషన్‌లో రూపొందుతున్నఎన్‌జీకే (తెలుగు) టీజర్ రిలీజ్..
తమిళ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ శ్రీ రాఘవ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా.. ఎన్‌జీకే.. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ హీరోయిన్స్‌గా నటించిన ఎన్‌జీకే టీజర్.. లవర్స్ డే స్పెషల్‌గా రిలీజ్ అయ్యింది. తమిళ్‌తో పాటు, తెలుగు టీజర్ కూడా విడుదల చేసారు.. తమిళ్‌లో సూర్య పేరు.. నంద గోపాలన్ కుమరన్.. అయితే, తెలుగులో నంద గోపాల కృష్ణగా కనిపించబోతున్నాడు. తెలుగులో మొదటిసారి సూర్య, తన క్యారెక్టర్‌కి తనే డబ్బింగ్ చెప్పడం విశేషం.. నా పేరు, నంద గోపాల కృష్ణ.. ప్రజలు నన్ను ఎన్‌జీకే అని పిలుస్తారు.. అంటూ సాగే సూర్య వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ స్టార్ట్ అయ్యింది.. ఎన్‌జీకేలో సూర్య క్యారెక్టర్‌కి వినికిడి లోపం ఉంటుందని తెలుస్తుంది.
రాజకీయాల్లోకి రావాలనుకున్న నంద గోపాలని ఎగతాళి చేసిన వారే, తిరిగి అతనికి సపోర్ట్ చెయ్యడం, ప్రత్యర్థుల సవాళ్ళను ఎదుర్కోవడం, గోపాలా.. పోరా నాన్నా.. నువ్వు దిగితే ఎలాంటి మురికైనా శుభ్రం అవుతుంది అంటూ, భార్య (సాయి పల్లవి) సపోర్ట్ చెయ్యడం వంటివి టీజర్‌లో చూపించారు.. సమకాలీన రాజకీయాలకు అద్దం పట్టేలా తెరకెక్కిన ఎన్‌జీకే ఆడియో త్వరలో విడుదల కానుంది.. ఈ సినిమాకి సంగీతం : యువన్ శంకర్ రాజా, కెమెరా : శివకుమార్ విజయన్, ఎడిటింగ్ : ప్రవీణ్ కె.ఎల్, ఆర్ట్ : విజయ్ మురగన్, నిర్మాణం : ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు, బ్యానర్ : డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్,
వాచ్ ఎన్‌జీకే టీజర్…