Night Curfew Tollywood : టాలీవుడ్‌పై నైట్ కర్ఫ్యూ ఎఫెక్ట్.. రోజుకు రెండు షోలు మాత్రమే

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నైట్ కర్ఫ్యూ నిర్ణయం టాలీవుడ్‌పై ప్రభావం చూపిస్తోంది. నైట్ కర్ఫ్యూ కారణంగా రాత్రి 8 గంటలకే సినిమా థియేటర్లు మూసేయాల్సి ఉంటుంది.

Night Curfew Tollywood : టాలీవుడ్‌పై నైట్ కర్ఫ్యూ ఎఫెక్ట్.. రోజుకు రెండు షోలు మాత్రమే

Night Curfew Tollywood

Updated On : April 20, 2021 / 2:31 PM IST

Night curfew effect on Tollywood : కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నైట్ కర్ఫ్యూ నిర్ణయం టాలీవుడ్‌పై ప్రభావం చూపిస్తోంది. నైట్ కర్ఫ్యూ కారణంగా రాత్రి 8 గంటలకే సినిమా థియేటర్లు మూసేయాల్సి ఉంటుంది. అంటే మల్టీప్లెక్సుల్లో కాకుండా మామూలు థియేటర్లలో రోజులో రెండు షోలు మాత్రమే వేయాల్సి ఉంటుంది. నైట్ కర్ఫ్యూ వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని థియేటర్ల ఓనర్లు ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు… కొత్తగా విడుదలయ్యే సినిమాలపైనా నైట్ కర్ఫ్యూ ప్రభావం ఉంటుందని నిర్మాతలు, బయ్యర్లు అంటున్నారు. కరోనా కారణంగా గత ఏడాది సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. ఈ సెకండ్‌ వేవ్‌తో మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.