Niharika Konidela : నిహారిక నిర్మాతగా.. ఏకంగా ఇరవై మందికి పైగా కొత్తవాళ్లతో సినిమా.. ‘కమిటీ కుర్రాళ్ళు’
నేడు ఉగాది సందర్భంగా సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ నిహారిక మొదటి సినిమా టైటిల్ ని విడుదల చేసారు.

Niharika Konidela First Movie as Producer Title Announced
Niharika Konidela : యాంకర్ గా, నటిగా, నిర్మాతగా ఇప్పటికే మెగా డాటర్ నిహారిక కొణిదెల మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇన్నాళ్లు ఓటీటీ సిరీస్ లు, యూట్యూబ్ లో సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ నిర్మించిన నిహారిక మొదటి సారి తన బ్యానర్ పై సినిమాని నిర్మిస్తుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిహారిక, ఫణి నిర్మాతలుగా యదు వంశీ దర్శకత్వంలో తమ మొదటి సినిమా టైటిల్ ని నేడు ప్రకటించారు.
నేడు ఉగాది సందర్భంగా సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ నిహారిక మొదటి సినిమా టైటిల్ ని విడుదల చేసారు. అలాగే టైటిల్ గ్లింప్స్ కూడా రిలీజ్ చెశారు. ఏకంగా 20 మందికి పైగా కొత్తవాళ్లతో నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘కమిటీ కుర్రాళ్ళు’ అనే ఆసక్తికర టైటిల్ ని ప్రకటించారు. కమిటీ కుర్రాళ్ళు గ్లింప్స్ చూస్తుంటే.. గోదావరి పల్లెటూళ్ళో ఉండే కాలేజీ కుర్రాళ్ళ కథ అని తెలుస్తుంది. కామెడీ, ఎమోషనల్ కంటెంట్ తో ఈ సినిమా ఉండబోతున్నట్టు సమాచారం.
Also Read : Mamitha Baiju : లక్కీ ఛాన్స్ కొట్టేసిన ‘ప్రేమలు’ బ్యూటీ మమిత బైజు.. ఏకంగా విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్..
ఈ సినిమాలో ఏకంగా 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్‌ని పరిచయం చేస్తున్నామని, కమిటీ కుర్రాళ్ళు అనే టైటిల్ ఎందుకు పెట్టారో సినిమా చూస్తే అర్థమవుతుందని, డిఫరెంట్ కంటెంట్ తో రాబోతున్నాం అని తెలిపారు నిహారిక. షార్ట్ ఫిలిమ్స్, సోషల్ మీడియాలో ఫేమస్ అయినా చాలా మందిని ఈ సినిమాతో వెండితెరపై పరిచయం చేయబోతున్నారు.