Varun Tej : ఫ్యామిలీతో వరుణ్ తేజ్ విదేశీ టూర్‌కి కారణం అదేనా..?
ఇటీవల ఫ్యామిలీతో కలిసి వరుణ్ తేజ్ విదేశీ టూర్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ టూర్‌కి వెళ్ళింది కేవలం ఎంజాయ్ చేయడం కోసమే కాదట.

Niharika Konidela Nagababu Varun Tej family vacation tour is for wedding planning
Varun Tej : గాండీవధారి అర్జున (Gandeevadhari Arjuna) సినిమాతో ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చి నిరాశ పరిచిన వరుణ్ తేజ్.. కొన్ని రోజులు క్రితం కుటుంబంతో కలిసి విదేశాలకు హాలీడే టూర్ కి వెళ్ళాడు. నాగబాబు (Nagababu), నిహారిక (Niharika Konidela), తల్లి పద్మజతో కలిసి వరుణ్.. కెన్యాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ టూర్ కి సంబంధించిన ఫోటోలను ప్రతిఒక్కరు తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే, వరుణ్ తన కుటుంబంతో కలిసి విదేశీ టూర్‌కి వెళ్ళింది కేవలం ఎంజాయ్ చేయడం కోసమే కాదట.
Peddha Kapu 1 : సెప్టెంబర్‌లోనే వచ్చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల పెదకాపు-1.. రిలీజ్ డేట్..!
View this post on Instagram
వరుణ్ తేజ్ త్వరలో లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో చేసుకోబోతున్నట్లు వరుణ్ ఇప్పటికే ప్రకటించాడు. ఇందుకోసం ఇండియాలో ఒక మూడు, ఫారిన్ లో రెండు ప్లేస్‌లను పరిశీలిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలోనే వరుణ్ కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్ళాడంటూ చెబుతున్నారు. కాగా ఈ వివాహం ఈ ఏడాది నవంబర్ లో జరగబోతుంది అంటూ ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
Miss Shetty Mr Polishetty : చిరు రివ్యూస్.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తొలి ప్రేక్షకుడ్ని నేనే..
View this post on Instagram
కాగా వరుణ్, లావణ్య.. ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ సినిమాల్లో కలిసి నటించారు. ఆ మూవీ షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైనట్లు, ముందుగా వరుణే ప్రపోజ్ చేసినట్లు కూడా ఇటీవల వెల్లడించాడు. అయితే ఈ ప్రేమ విషయాన్ని మాత్రం ఎంగేజ్మెంట్ వరకు రహస్యంగానే ఉంచుతూ వచ్చాడు. ఇక వరుణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తన చేతిలో ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine), ‘మట్కా’ (Matka) చిత్రాలు ఉన్నాయి. ఆపరేషన్ వాలెంటైన్ షూటింగ్ ఆల్రెడీ మొదలు కాగా.. మట్కా సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్దమవుతుంది.