నిహారిక కొణిదెల ‘సూర్యకాంతం’ ట్రైలర్ రిలీజ్

మెగా డాటర్ నీహారిక టైటిల్ రోల్ లో రాహుల్ విజయ్ హీరోగా నటించిన సూర్యకాంతం ట్రైలర్ మంగళవారం(మార్చి 26, 2019)నాడు విడుదలైంది. నాకు ఇన్ డైరెక్ట్‌గా ప్రపోజ్ చేశావ్.. రా వెధవ అంటూ ‘సూర్యకాంతం’ ట్రైలర్‌తో వచ్చేసింది నిహారిక. రాహుల్ విజయ్, నిహారిక జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహించారు. వరుణ్ తేజ్ సమర్పణలో నిర్వాణ సినిమాస్ బ్యానర్‌లో మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఇద్దరి భామల ప్రేమలో నలిగిపోయే అమాయకపు యువకుడిగా రాహుల్ విజయ్ నటించారు. సూర్యకాంతంగా నిహారిక.. విజయ్‌కి చుక్కలు చూపిస్తుంటే.. సాఫ్ట్ గర్ల్‌గా బిసానియా గ్లామరస్ లుక్‌తో ఆకట్టుకుంటోంది. మరి ఈ ప్రేమ యుధ్ధంలో సూర్యకాంతం ఎలా నెగ్గింది అనేది కథ.. లవ్, ఎమెషన్స్, ఫన్, సెంటిమెంట్ తో ‘సూర్యకాంతం’ ఈసారి హిట్ కొట్టేట్టు కనిపిస్తుంది.
శివాజీ రాజా హీరో తండ్రిగా సత్య అభి ఫ్రెండ్ గా కామెడీ పార్ట్ ని తీసుకున్నారు. మార్క్ కె రాబిన్ సంగీతం మ్యాచ్ అయ్యింది. మొత్తానికి నీహారిక బాడీ లాంగ్వేజ్ కు తగ్గ కథగా సూర్యకాంతం సరైన టైంలో వస్తున్నట్టు కనిపిస్తోంది. అంతేకాదు ఈ చిత్రానికి నిహారిక క్యారెక్టర్ సూపర్ గా సెట్ అవుతుందని తెలుస్తోంది.