Committee Kurrollu : ‘కమిటీ కుర్రోళ్ళు’ ఓటీటీకి వచ్చేస్తుంది.. ఎప్పట్నించి? స్ట్రీమింగ్ ఎక్కడ?
కమిటీ కుర్రోళ్ళు సినిమా ఓటీటీలోకి రాబోతుంది.
Committee Kurrollu : నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధ దామోదర్ స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో కొత్త దర్శకుడు యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కమిటీ కుర్రోళ్ళు’. సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో పాపులర్ అయిన వాళ్ళని, కొత్త వాళ్ళని మెయిన్ లీడ్స్ గా తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు. ఆగస్టు 9న చిన్న సినిమాగా థియేటర్స్ లో రిలీజయి ఇప్పటికే భారీ విజయం సాధించి 17 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.
కొంతమంది 90s కిడ్స్ చదువు, ప్రేమలు, ఊళ్ళో వారి జీవితం, స్నేహం, రిజర్వేషన్లు, ఊళ్ళో జరిగే జాతరలు.. ఇలా అన్ని అంశాలు కలిపి ఒక ఫీల్ గుడ్ మూవీగా కమిటీ కుర్రోళ్ళు తెరకెక్కింది. ప్రేక్షకులందర్నీ మెప్పించింది. ముఖ్యంగా 90s కిడ్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళు సినిమా ఓటీటీలోకి రాబోతుంది.
Also Read : Prabhas – Faria Abdullah : కల్కి సెట్‌లో ప్రభాస్ సార్ నన్ను చూసి.. అలా అనేసరికి నేను షాక్.. మాకు కూడా ఫుడ్..
కమిటీ కుర్రోళ్ళు సినిమా ఈటీవి విన్ ఓటీటీలోకి రాబోతుంది. సెప్టెంబర్ 12 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో కమిటీ కుర్రోళ్ళు స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ అధికారికంగా ప్రకటించింది. థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఉంటే కచ్చితంగా ఓటీటీలో చూసేయండి.