Nikhil – Vishnupriya : బిగ్‌బాస్ లో పుష్ప 2 హవా.. నిఖిల్, విష్ణుప్రియ స్టెప్పులు అదుర్స్.. విష్ణుప్రియను ఎత్తుకొని..
నిఖిల్, విష్ణుప్రియ కలిసి పుష్ప సినిమాలోని పాటలకు డ్యాన్సులు వేశారు.

Nikhil and Vishnupriya Performing Dance for Pushpa Songs in Bigg Boss 8
Nikhil – Vishnupriya : తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8 చివరికొచ్చేసింది. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అంతా టాప్ 5 లోకి వెళ్లాలని, కప్పు గెలవాలని తెగ కష్టపడుతున్నారు. బిగ్‌బాస్ లో గేమ్స్ తో పాటు కూసింత ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని తెలిసిందే. ప్రస్తుతం అన్నిచోట్లా పుష్ప హవా నడుస్తుంది. ఈ క్రమంలో బిగ్‌బాస్ లో కూడా పుష్ప క్రేజ్ పాకింది.
Also Read : Pushpa 2 : రిలీజ్ కి ముందు ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన పుష్ప యూనిట్.. ఆ టికెట్స్ బుక్ చేసుకుంటే..
నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ తో డ్యాన్సులు వేయించారు. ఇందులో నిఖిల్, విష్ణుప్రియ కలిసి పుష్ప సినిమాలోని పాటలకు డ్యాన్సులు వేశారు. పుష్ప 1 లో సామి సామి పాటతో పాటు పుష్ప 2 సినిమాలోని పీలింగ్స్ సాంగ్స్ కి అదిరిపోయే స్టెప్పులు వేశారు. అల్లు అర్జున్, రష్మిక లాగే నిఖిల్, విష్ణుప్రియ కూడా తమ డ్యాన్సులతో అదరగొట్టారు. సాంగ్ లో చేసినట్టే నిఖిల్ కూడా విష్ణుప్రియని ఎత్తుకొని పుష్ప పాటకు స్టెప్పులు వేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. మీరు కూడా నిఖిల్, విష్ణుప్రియ పుష్ప సాంగ్ కి వేసిన స్టెప్పులు చూసేయండి..
#Peelings Mania On #BiggBossTelugu8
🤩💥🔥#Pushpa2TheRule @alluarjun #Pushpa2 pic.twitter.com/B0kjuIszCR
— Allu Arjun TFC™ (@AlluArjunTFC) December 3, 2024
నిఖిల్, విష్ణుప్రియ డ్యాన్స్ చూసి వారి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తుంటే బన్నీ ఫ్యాన్స్ పుష్ప క్రేజ్ మాములుగా లేదుగా అని కామెంట్స్ చేస్తున్నారు.