Nikhil Siddhartha : ఘనంగా హీరో నిఖిల్ కొడుకు నిఖిల్ బారసాల.. వైరల్ అవుతున్న ఫొటోలు..

ఇటీవల ఫిబ్రవరి 21న మగబిడ్డ పుట్టాడని నిఖిల్ అధికారికంగా తెలిపాడు. తాజాగా నిఖిల్ తనయుడి బారసాలని నిన్న ఘనంగా నిర్వచాహించారు.

Nikhil Siddhartha : ఘనంగా హీరో నిఖిల్ కొడుకు నిఖిల్ బారసాల.. వైరల్ అవుతున్న ఫొటోలు..

Nikhil Siddhartha son Cradle Ceremony Photos goes Viral

Updated On : March 17, 2024 / 11:58 AM IST

Nikhil Siddhartha : హీరో నిఖిల్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. కార్తికేయ 2, 18 పేజెస్, స్పై లాంటి సినిమాలతో వరుస విజయాలు సాధించాడు. స్వయంభు, ది ఇండియన్ హౌస్, కార్తికేయ 3 లాంటి పాన్ ఇండియా సినిమాలని నెక్స్ట్ లైన్ లో పెట్టాడు నిఖిల్. పల్లవి అనే డాక్టర్ ని ప్రేమించి నిఖిల్ 2020లో కరోనా సమయంలో సింపుల్ గా వివాహం చేసుకున్నాడు.

Also Read : Karthikeya 3 : ‘కార్తికేయ 3’ పక్కా ఉంది.. అప్డేట్ ఇచ్చిన నిఖిల్.. త్వరలోనే కొత్త అడ్వెంచర్..

 

ఈ జంటకి ఇటీవల ఫిబ్రవరి 21న మగబిడ్డ పుట్టాడని నిఖిల్ అధికారికంగా తెలిపాడు. తాజాగా నిఖిల్ తనయుడి బారసాలని నిన్న ఘనంగా నిర్వచాహించారు. నిఖిల్ ఇంట్లోనే కేవలం కుటుంబ సభ్యుల మధ్యే ఈ బారసాల వేడుకని జరిపినట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఓ రెండు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Nikhil Siddhartha son Cradle Ceremony Photos goes Viral

ఓ ఫొటోలో నిఖిల్, పల్లవి తమ బాబుని ఎత్తుకొని చూస్తుండగా మరో ఫొటోలో బాబుని ఉయ్యాలలో వేసి ఆడిస్తున్నారు. ఇక బాబు ఫేస్ కనిపించకుండా పేస్ పై లవ్ సింబల్ పెట్టడం గమనార్హం. అయితే బాబుకి ఏం పేరు పెట్టారు అంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పందించి నిఖిల్ అధికారికంగా బాబు పేరుని ప్రకటిస్తాడేమో చూడాలి.

 

Nikhil Siddhartha son Cradle Ceremony Photos goes Viral