Spy Movie : ఏ ప్రకటన లేకుండా ఓటీటీకి వచ్చేసిన నిఖిల్ స్పై.. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో తెలుసా..?
నిఖిల్ నటించిన ‘స్పై’ మూవీ ఎటువంటి ప్రకటన లేకుండా సడన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో తెలుసా..?

Nikhil Siddhartha Spy Movie released in Amazon Prime Video
Spy Movie : కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddhartha) ఇటీవల ‘స్పై’ అనే యాక్షన్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ప్రముఖ మూవీ ఎడిటర్ ‘గ్యారీ’ దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ సినిమాని తెరకెక్కించాడు. ఐశ్వర్య మీనన్(Iswarya Menon) హీరోయిన్ గా నటించింది. సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ పై సినిమా కథాంశం ఉండబోతుందని చెప్పడంతో మూవీ పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. పాన్ ఇండియా సబ్జెక్టు కావడంతో ఈ చిత్రాన్ని కూడా ఇండియా వైడ్ రిలీజ్ చేశారు.
అయితే ఈ మూవీ థియేటర్ వద్ద ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఈ మూవీని అసలు థియేటర్ లో చూడని వాళ్ళు ఓటీటీకి వచ్చాక చూద్దామని ఎదురు చూస్తున్నారు. అయితే ఓటీటీ రిలీజ్ డేట్ గురించి ఎటువంటి ప్రకటన లేకుండా సడన్ గా ఓటీటీలో అందుబాటులోకి తీసుకు వచ్చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ నేడు జులై 27 నుంచి అందుబాటులోకి వచ్చింది. మరి థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఓటీటీలో చూసేయండి.
ఇక నిఖిల్ కొత్త సినిమాల విషయానికి వస్తే.. నాలుగు సినిమాలు లైన్ లో ఉన్నాయి. వీటిలో మూడు సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్. ఒకటి ఫాంటసీ డ్రామాతో రాబోతున్న ‘స్వయంభు’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ మూవీతో నిఖిల్ మొదటిసారి వారియర్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇక ఈ మూవీ తరువాత రామ్ చరణ్ నిర్మించబోతున్న ‘ది ఇండియన్ హౌస్’, ఆ తరువాత ‘కార్తికేయ 3’ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గా రాబోతుంది. ఈ చిత్రాలు తరువాత తనకి స్వామి రారా, కేశవా వంటి హిట్స్ అందించిన సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు.