Swayambhu : బాహుబలి లాగే నిఖిల్ ‘స్వయంభు’ కూడా..

హీరో నిఖిల్ కూడా స్వయంభు అనే సినిమా చేస్తున్నాడు.

Swayambhu : బాహుబలి లాగే నిఖిల్ ‘స్వయంభు’ కూడా..

Swayambhu

Updated On : July 12, 2025 / 3:05 PM IST

Swayambhu : బాహుబలి సినిమా తెలుగు పరిశ్రమని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాతే అందరూ ధైర్యం చేసి మళ్ళీ పాన్ ఇండియా సినిమాలు, రాజుల కాలం నాటి సినిమాలు తీస్తున్నారు. ఇదే కోవలో హీరో నిఖిల్ కూడా స్వయంభు అనే సినిమా చేస్తున్నాడు.

భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నభా నటేష్, సంయుక్త హీరోయిన్స్ గా భారీగా స్వయంభు సినిమా రాజుల కాలం కథతో తెరకెక్కుతుంది. తాజాగా స్వయంభు సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం తెలిపారు.

Also Read : Senthil Kumar : రాజమౌళితో ఏ సమస్య లేదు.. మహేష్ సినిమా ఎందుకు చేయట్లేదో చెప్పిన స్టార్ సినిమాటోగ్రాఫర్..

సెంథిల్ కుమార్ మాట్లాడుతూ.. స్వయంభు సినిమా కూడా బాహుబలి లాగే రాజుల కథ. కొన్ని వందల ఏళ్ళ క్రితం కథ. అది కూడా చాలా భారీగా ఉంటుంది. ఆ సినిమాకు కూడా రెండు పార్టులు అనుకుంటున్నారు కానీ మొదటి పార్ట్ రిజల్ట్ చూసి డిసైడ్ అవుతారు. సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది అని తెలిపారు. ఈ సినిమా కోసం నిఖిల్, సంయుక్త, నభా నటేష్.. కత్తి యుద్దాలు, ఆర్చరీ.. లాంటి రాజుల కాలం పోరాటాల శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.