Nikhil Siddhartha : ‘స్పై’ సినిమా రిలీజ్ తర్వాత సినిమాలకు గ్యాప్ ప్రకటించిన నిఖిల్.. మరి లైన్‌లో ఉన్న పాన్ ఇండియా సినిమాలు?

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఏర్పాటు చేసిన చిట్ చాట్ లో చిత్రయూనిట్ పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో నిఖిల్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Nikhil Siddhartha : ‘స్పై’ సినిమా రిలీజ్ తర్వాత సినిమాలకు గ్యాప్ ప్రకటించిన నిఖిల్.. మరి లైన్‌లో ఉన్న పాన్ ఇండియా సినిమాలు?

Nikhil Siddhartha wants to take break from movies after Spy Release

Updated On : June 28, 2023 / 9:56 AM IST

SPY Movie :  కార్తికేయ 2(Karthikeya 2), 18 పేజెస్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు నిఖిల్ సిద్దార్థ(Nikhil Siddhartha). ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమా ‘స్పై’ తో రాబోతున్నాడు. ఐశ్వర్య మీనన్(Iswarya Menon) హీరోయిన్ గా, ఎడిటర్ గ్యారీ దర్శకుడిగా ఈ సినిమా భారీగా తెరకెక్కింది, నిఖిల్ ‘స్పై’(SPY) సినిమా జూన్ 29న పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా సుభాష్ చంద్రబోస్(Subhas Chandrabose) మరణం వెనుక ఉన్న రహస్యాల ఆధారంగా తెరకెక్కించినట్టు సమాచారం.

ఇప్పటికే స్పై సినిమా పై నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఏర్పాటు చేసిన చిట్ చాట్ లో చిత్రయూనిట్ పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో నిఖిల్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నిఖిల్ మాట్లాడుతూ.. వరుసగా హెవీ సబ్జెక్ట్ సినిమాలకు సైన్ చేశాను. వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాను. కార్తికేయ 2 సినిమా నుంచి నా మైండ్ అంతా జామ్ అయింది. ఖాళీ లేకుండా వరుసగా సినిమాలు, ప్రమోషన్స్ చేస్తున్నాను. మైండ్ కి కొంచెం రిలీఫ్ కావాలి. అందుకే ఓ రెండు నెలలు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నాను. ఓ రెండు నెలలు ఎటైనా వెకేషన్ కి వెళ్లి కొంచెం రిలాక్స్ అయి అనంతరం మళ్ళీ సినిమాల మీద ఫోకస్ చేస్తాను. తర్వాత కూడా సినిమా, సినిమాకు కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకుంటాను. ఈ రెండు నెలల గ్యాప్ అయిపోయిన తర్వాత స్వయంభు సినిమా షూట్ మొదలుపెడతాము అని తెలిపాడు.

Sai Kabir : సినిమా రిలీజ్‌కి ముందు డ్రగ్స్‌కి అడిక్ట్ అయి.. రిహాబిటేషన్ సెంటర్‌లో చేరిన డైరెక్టర్

స్పై సినిమా తర్వాత నిఖిల్ మరో నాలుగు పాన్ ఇండియా సినిమాలు చేయనున్నాడు. స్వయంభు, ది ఇండియా హౌస్, సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా, కార్తికేయ 3 సినిమాలు నిఖిల్ చేతిలో ఉన్నాయి.