SPY Movie: టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్ చేసిన స్పై.. నిజమేనా?

యంగ్ హీరో నిఖిల్ నటిస్తోన్న ‘స్పై’ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ డేట్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.

SPY Movie: టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్ చేసిన స్పై.. నిజమేనా?

Nikhil SPY Movie Teaser Release Date Fixed

Nikhil SPY: యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్(Nikhil Siddharth) ‘కార్తికేయ-2’ మూవీతో పాన్ ఇండియా హీరోగా సాలిడ్ సక్సెస్‌ను అందుకున్నాడు. ఇక ఈ హీరో ప్రస్తుతం మరో పాన్ ఇండియా సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈసారి ‘స్పై’(SPY) అనే స్పై థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయ్యాడు ఈ హీరో. ఇక ఈ సిమాను గ్యారీ(Garry) డైరెక్ట్ చేస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్ ఈ మూవీపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

SPY Movie: సుభాష్ చంద్రబోస్ మిస్టరీని బయటపెట్టేందుకు రెడీ అయిన స్పై

అయితే, ఈ సినిమా నుండి త్వరలోనే ఓ మాసివ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. స్పై మూవీకి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఈ టీజర్ కట్‌ను ప్రేక్షకులు పూర్తిగా ఎంజాయ్ చేస్తారని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయని వారు అంటున్నారు. కాగా, ఈ టీజర్‌ను మే 15న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Spy Movie: నిఖిల్ ‘స్పై’ మూవీ డిజిటల్ రైట్స్‌కు భారీ రేటు..?

ఈ భారీ చిత్రాన్ని జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతోండగా, ఈ మూవీ టీజర్ నిజంగానే మే 15న రిలీజ్ కానుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈడీ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.