Nishaanchi : బాల్ ఠాక్రే మనవడు హీరోగా ఎంట్రీ.. అనురాగ్ కశ్యప్ డైరెక్షన్ లో.. ట్రైలర్ రిలీజ్.. సినిమా ఎప్పుడంటే..
మరాఠా పాపులర్ రాజకీయ నేత దివంగత బాల్ ఠాక్రే మనవడు ఐశ్వరి థాకరే హీరోగా ఎంటర్ ఇవ్వబోతున్నాడు. (Nishaanchi)

Nishaanchi
Nishaanchi : మరాఠా పాపులర్ రాజకీయ నేత దివంగత బాల్ ఠాక్రే మనవడు ఐశ్వరి థాకరే హీరోగా ఎంటర్ ఇవ్వబోతున్నాడు. మొదటి సినిమాలోనే డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. జార్ పిక్చర్స్ బ్యానర్‌పై అజయ్ రాయ్, రంజన్ సింగ్ నిర్మాణంలో, ఫ్లిప్ ఫిల్మ్స్ సహకారంతో అనురాగ్ కహ్యాపీ దర్శకత్వంలో మరాఠీలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అమెజాన్ MGM స్టూడియో ఇండియా ద్వారా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.(Nishaanchi)
తాజాగా నిశాంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 19న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. 2000 సంవత్సరంలో ఉత్తర్ ప్రదేశ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్, రొమాన్స్, కామెడీ కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఐశ్వరి థాకరేతో పాటు వేదిక పింటో, మోనిక పన్వర్, మొహమ్మద్ జీషాన్ ఆయుబ్, కుముద్ మిశ్రా.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా అమెజాన్ MGM స్టూడియో డైరెక్టర్ నిఖిల్ మధోక్.. భారతీయ సినిమాలో తనదైన ముద్ర వేసిన అనురాగ్ కశ్యప్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది అని అన్నారు. మీరు కూడా నిశాంచి ట్రైలర్ చూసేయండి..