Extra Ordinary Man : ప్రభాస్ సలార్ దెబ్బకి నితిన్ కూడా.. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ రిలీజ్ డేట్ ఛేంజ్..
ప్రభాస్(Prabhas) సలార్(Salaar) మళ్ళీ వాయిదా పడి డిసెంబర్ 22న రాబోతున్నట్టు ప్రకటించారు. దీంతో ఆ డేట్ దగ్గర్లో అనౌన్స్ చేసిన సినిమాలన్నీ వాయిదా వేసుకోవడం లేదా ముందుకి రావడం చేస్తున్నాయి.

Nithiin Extra Ordinary Man Movie Release Date Changed due to Prabhas Salaar Movie
Extra Ordinary Man : నితిన్(Nithiin) ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా తర్వాత తన 32వ సినిమాతో రాబోతున్నాడు. నితిన్ తన సొంత బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ లో ప్రముఖ రైటర్ వక్కంతం వంశీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల(Sreeleela) నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే ఈ సినిమాకు ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ అనే టైటిల్ ని ప్రకటించారు.
ఇక ఈ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాని డిసెంబర్ 23న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. కానీ ప్రభాస్(Prabhas) సలార్(Salaar) మళ్ళీ వాయిదా పడి డిసెంబర్ 22న రాబోతున్నట్టు ప్రకటించారు. దీంతో ఆ డేట్ దగ్గర్లో అనౌన్స్ చేసిన సినిమాలన్నీ వాయిదా వేసుకోవడం లేదా ముందుకి రావడం చేస్తున్నాయి.
Also Read : Sreeleela : స్టేజిపై ఎమోషనల్ అయిన శ్రీలీల.. నాన్న వదిలేసి వెళ్లిన లోటుని గుర్తు చేసుకుంటూ బాలయ్య నాన్నలా..
ఇప్పటికే వెంకటేష్(Venkatesh) సైంధవ్(Saindhav) సినిమాని డిసెంబర్ నుంచి సంక్రాంతికి తీసుకెళ్లారు. ఇక నాని హాయ్ నాన్న ఇంకా ముందే రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు ఇదే బాటలో నితిన్ కూడా తన సినిమాని ముందుకు తీసుకొచ్చేశాడు. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాని డిసెంబర్ 8న రిలీజ్ చేయబోతున్నట్టు కొత్త డేట్ ని ప్రకటించారు. ఈ సినిమా ప్రేక్షకులని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి మరి. మొత్తానికి ప్రభాస్ సలార్ సినిమా అందరి సినిమాలపై ఎఫెక్ట్ చూపిస్తుంది.
Our #????? – ???????? ??? is all set to give you an EXTRAORDINARY entertainment on December 8th! ?
Get ready to WHISTLE in theatres❤️?#ExtraOrdinaryManOnDec8th
@sreeleela14 @vamsivakkantham @Jharrisjayaraj @SreshthMovies @vamsikaka @adityamusic pic.twitter.com/0UlGZX2q38
— nithiin (@actor_nithiin) October 9, 2023