Nithiin Tammudu : శివరాత్రికి ‘తమ్ముడు’ వచ్చేస్తున్నాడు.. పవన్ టైటిల్‌తో నితిన్.. తమ్ముడికి అక్క ఎవరో తెలుసా?
పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలో అన్న తమ్ముడు సెంటిమెంట్ అయితే.. నితిన్ తమ్ముడు సినిమాలో అక్క తమ్ముడు సెంటిమెంట్ ఉండనుంది.

Nithiin Tammudu Movie Release Date Announced with New Poster
Nithiin Tammudu Movie : నితిన్ గతంలో వరుస హిట్స్ కొట్టి ఇటీవల కొంచెం స్లో అయ్యాడు. త్వరలో డిసెంబర్ లో రాబిన్ హుడ్ సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత మరో ఆసక్తికర సినిమాతో రాబోతున్నాడు. తనకు ఎంతో ఇష్టమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ ని వాడనుకుంటున్నాడు నితిన్. పవన్ కళ్యాణ్ తమ్ముడు టైటిల్ తో నితిన్ కొన్నాళ్ల క్రితం సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా రాబోతుంది.
Also Read : Anushka Shetty : అనుష్క నెక్స్ట్ సినిమా అప్డేట్.. హరిహర వీరమల్లు వదిలేసి అనుష్క సినిమాతో క్రిష్ బిజీ..
పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలో అన్న తమ్ముడు సెంటిమెంట్ అయితే.. నితిన్ తమ్ముడు సినిమాలో అక్క తమ్ముడు సెంటిమెంట్ ఉండనుంది. ఈ సినిమాలో నితిన్ కు అక్కగా ఒకప్పటి హీరోయిన్ లయ నటిస్తుంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేని తమ్ముడు సినిమా నుంచి తాజాగా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ఓ పోస్టర్ ని కూడా ప్రకటించారు.
నితిన్ తమ్ముడు సినిమా 2025 మహా శివరాత్రికి రిలీజ్ చేయనున్నట్టు నేడు ప్రకటించారు. అలాగే పోస్టర్ లో నితిన్ ఓ చిన్న పాపని భుజంపై ఎక్కించుకొని చేతిలో వెలుగుతున్న కాగడా పట్టుకొని, వెనకాల కొంతమంది తరుముతుంటే పరిగెడుతున్నట్టు ఉంది. ఓ మంచి యాక్షన్ సీన్ లోనిది ఈ ఫోటో అని తెలుస్తుంది. ఈ ఫోటో చూస్తుంటే అక్క కూతుర్ని కాపాడటానికి తమ్ముడు ఏం చేసాడు అనే కథాంశం ఉండబోతుందా అని సందేహం వస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారింది.
His Remarkable 𝐑𝐄𝐒𝐈𝐋𝐈𝐄𝐍𝐂𝐄🔥
His Massive 𝐏𝐎𝐖𝐄𝐑💥Make Way for a New Brother in Town @actor_nithiin 😎#Thammudu Arriving on Maha Shivaratri – 2025 with a Powerful Tale of Courage and Ambition🔱❤️🔥#ThammuduForShivaratri
A Film by #SriramVenu#DilRaju… pic.twitter.com/RdL3etjOxv
— Sri Venkateswara Creations (@SVC_official) November 4, 2024