Nithya Menen : నిత్యామీనన్ ఇంట విషాదం.. మరో లోకంలో మిమ్మల్ని కలుసుకుంటా అంటూ పోస్ట్..

హీరోయిన్ నిత్యామీనన్ ఇంట విషాదం నెలకుంది. మిమ్మల్ని మరో లోకంలో కలుసుకుంటా అంటూ ఎమోషనల్ పోస్ట్..

Nithya Menen : నిత్యామీనన్ ఇంట విషాదం.. మరో లోకంలో మిమ్మల్ని కలుసుకుంటా అంటూ పోస్ట్..

Nithya Menen post on her grand mother demise

Updated On : July 16, 2023 / 8:44 AM IST

Nithya Menen : మలయాళ భామ నిత్యా మీనన్.. నాని ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అందాల ఆరబోతతో కాకుండా తన యాక్టింగ్ తో టాలీవుడ్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ భామ.. నార్త్ అండ్ సౌత్ చిత్రాలతో పాటు హాలీవుడ్ సినిమాలో కూడా నటించింది. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ హీరోయిన్ ఇంట విషాదం నెలకుంది. తన బాధని వ్యక్తం చేస్తూ నిత్యా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

Bhagavad Gita : ఆ పాత్రని అర్ధం చేసుకోవడం కోసం భగవద్గీత చదివాను.. హాలీవుడ్ నటుడు సిలియన్ మర్ఫీ!

నిత్యా ఎంతగానో ప్రేమించే తన అమ్మమ్మ చనిపోయారు. ఈమె కంటే ముందు నిత్యా తన తాతయ్యని కూడా కోల్పోయింది. ఇప్పుడు ఇద్దరు తనతో లేరు అన్న విషయాన్ని నిత్యామీనన్ జీర్ణించుకోలేకపోతోంది. దీంతో ఆ బాధతో తన ఇన్‌స్టాలో అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి ఉన్న పిక్ ని షేర్ చేస్తూ.. “ఒక శకం ముగిసింది. గుడ్ బై అమ్మమ్మ అండ్ మై చెర్రీమ్యాన్. మిమ్మల్ని మరో లోకంలో కలుసుకుంటా” అంటూ పోస్ట్ వేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజెన్స్ ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Kajol – Shah Rukh Khan : ‘పఠాన్’ సినిమావి ఫేక్ కలెక్షన్స్ అంటున్న హీరోయిన్ కాజోల్..

 

View this post on Instagram

 

A post shared by Nithya Menen (@nithyamenen)

ఇక నిత్యామీనన్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం మలయాళంలో ఒక సినిమా, తమిళంలో మరో సినిమా చేస్తుంది. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే రెండు వెబ్ సిరీస్ ని రెడీ చేస్తుంది. అలాగే తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహాలో ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ (Telugu Indian Idol) లో జడ్జిగా చేస్తూ వస్తుంది.