సాహో సెట్‌లో నితిన్ గడ్కరీ

ప్రభాస్, శ్రద్ధ, సుజీత్‌లతో కాసేపు మాట్లాడిన నితిన్.. వారితో కలిసి ఫోటో దిగారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది..

  • Published By: sekhar ,Published On : April 27, 2019 / 06:40 AM IST
సాహో సెట్‌లో నితిన్ గడ్కరీ

Updated On : May 28, 2020 / 3:40 PM IST

ప్రభాస్, శ్రద్ధ, సుజీత్‌లతో కాసేపు మాట్లాడిన నితిన్.. వారితో కలిసి ఫోటో దిగారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా, రన్ రాజ్ రన్ ఫేమ్ సుజిత్ డైరెక్షన్‌లో, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం.. సాహో.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబాయిలో జరుగుతుంది. షూటింగ్ స్పాట్‌కి కేంద్రమంతి నితిన్ గడ్కరీ వచ్చి, యూనిట్‌ని సర్ ప్రైజ్ చేసారు. ప్రభాస్, శ్రద్ధ, సుజీత్‌లతో కాసేపు మాట్లాడిన నితిన్.. వారితో కలిసి ఫోటో దిగారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది.
Also Read : నిప్పుల కొలిమి : వరల్డ్ 15 హాటెస్ట్ నగరాలు భారత్‌లోనే

బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ మామూలుగా లేదు.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది తనకి.. ఆ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని, ఖర్చుకి వెనకాడకుండా, హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో సాహోని ప్రెస్టీజియస్ ఫిలింగా రూపొందిస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్, జాకీష్రాఫ్, ఎవెలిన్ శర్మ, మందిరా బేడి, వెన్నెల కిషోర్, బొమన్ ఇరానీ తదితరులు నటిస్తున్న సాహోని 2019 ఆగస్టు 15న రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
Also Read : విద్యార్థిని శ్రావణి మర్డర్ : అట్టుడుకుతున్న హాజీపూర్