35 Chinna Katha Kaadu : నాలుగు రోజుల్లో 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్.. ఆహాలో అదరగొడుతున్న ’35 చిన్న కథ కాదు’..

ఓటీటీలో దూసుకుపోతూ కొత్త రికార్డులు క్రియేట్ చేయబోతుంది ’35 చిన్న కథ కాదు’ సినిమా.

35 Chinna Katha Kaadu : నాలుగు రోజుల్లో 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్.. ఆహాలో అదరగొడుతున్న ’35 చిన్న కథ కాదు’..

Nivetha Thomas 35 Chinna Katha Kaadu Movie Getting Huge Viewership Creates new Records in Aha OTT

Updated On : October 6, 2024 / 2:58 PM IST

35 Chinna Katha Kaadu : గత నెల థియేటర్స్ లో రిలీజయి ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించిన ’35 చిన్న కథ కాదు’ సినిమా ఇటీవల అక్టోబర్ 2న ఆహా ఓటీటీలోకి వచ్చింది. ఆహా ఓటీటీలో ఈ సినిమా దూసుకుపోతుంది. నాలుగు రోజుల్లో ఈ సినిమా ఏకంగా 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ దక్కించుకుంది. ఇంకా ఓటీటీలో దూసుకుపోతూ కొత్త రికార్డులు క్రియేట్ చేయబోతుంది ’35 చిన్న కథ కాదు’ సినిమా.

నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజా.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ ’35 చిన్న కథ కాదు’ తెరకెక్కింది. సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ సినిమాని నిర్మించగా నంద కిషోర్ ఈమాని దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని మెచ్చి రానా దగ్గుబాటి రిలీజ్ చేసాడు.

Viswam Trailer : గోపీచంద్ ‘విశ్వం’ ట్రైలర్ వచ్చేసింది.. కామెడీతో పాటు యాక్షన్ కూడా..

ఇక ఈ సినిమాలో మంచి కథని చూపించారు. లెక్కల్లో ఎన్నో డౌట్స్ ఉన్న ఓ అబ్బాయికి లెక్కల టీచర్ కూడా పట్టించుకోకపోతే గృహిణి అయిన ఆ పిల్లాడి తల్లి అతన్ని ఆ లెక్కల గండం నుంచి ఎలా బయటపడేసింది అని మంచి కామెడీ ఎమోషనల్ కంటెంట్ గా తెరకెక్కించారు.

ఈ సినిమాలో నివేదా థామస్, చైల్డ్ ఆర్టిస్ట్ అరుణ్ అదరగొట్టేసారు. బ్రాహ్మణ కుటుంబంలో ఉండే మిడిల్ క్లాస్ గృహిణిగా, కొడుకు కోసం తపన పడే తల్లిగా, పతిని దైవంగా చూసే భార్య పాత్రలో నివేద థామస్ ఆ పాత్రలో ఒదిగిపోయింది. అసలు నివేదా తప్ప ఆ పాత్ర ఇంకెవ్వరు చేయలేరు అనే విధంగా చేసి మెప్పించింది. చైల్డ్ ఆర్టిస్ట్ అరుణ్ లెక్కలు అర్ధం కాక, తనకి వచ్చే డౌట్స్ తో సతమతం అయ్యే పాత్రలో మొదట కామెడీ చేసినా ఆ తర్వాత మంచి ఎమోషన్ పండించాడు. అరుణ్ ప్రేక్షకులని కొన్ని సీన్స్ లో కంటతడి కూడా పెట్టిస్తాడు.

Image

ఇక ప్రియదర్శి మ్యాథ్స్ టీచర్ పాత్రలో కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసాడు. సినిమాలో ప్రియదర్శిని చూస్తే మన చిన్నప్పటి మ్యాథ్స్ టీచర్లు కచ్చితంగా గుర్తుకు వస్తారు. విశ్వదేవ్ అరుణ్ తండ్రి పాత్రలో పిల్లలకు చదువు రాకపోతే ఏమైపోతారో అనే మిడిల్ క్లాస్ ఫాదర్ గా మెప్పించాడు. తిరుమల, తిరుపతిలో అన్ని మాకు తెలుసు, దర్శనం, ప్రసాదం, రూమ్స్ అన్ని ఇప్పిస్తాము అని చెప్పే ఒక లోకల్ వ్యక్తిగా, అరుణ్ మామ పాత్రలో కృష్ణ తేజ బాగా చేసాడు. ప్రిన్సిపాల్ గా భాగ్యరాజా, నివేదాని గైడ్ చేసే పర్సన్ గా గౌతమి, చైల్డ్ ఆర్టిస్టులు అభయ్ శంకర్, అనన్య.. ఇలా అందరూ ఈ సినిమాలో చాలా చక్కగా నటించారు. మీరు కూడా ఆహా ఓటీటీలో చూసేయండి ఈ సినిమాని.