మహేశ్‌తో కామెడీ సీన్.. చాలా చీప్‌గా అనిపించిందంటోన్న బండ్ల గణేశ్

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన వెంకీ సినిమా ట్రైన్ కామెడీ సీన్ రిపీట్ చేద్దామనుకున్నాడు అనిల్ రావిపూడి. సరిలేరు నీకెవ్వరు సినిమాలో అంతే రేంజ్ లో కామెడీ పండించాలని ప్రయత్నించాడు. ఈ సీన్లలో సైడ్ యాక్టర్లు పర్‌ఫార్మెన్స్ కూడా సూపర్ అనిపించినా మెయిన్ హీరో మహేశ్.. అంతగా సంతృప్తిపరచలేకపోయాడు.
స్టోరీ లైన్ తో సింక్ అవకుండా చేసిన కామెడీకి ఫ్యాన్స్ నుంచి కూడా నిరాశ ఎదురైంది. కాకపోతే ఈ సీన్ మొత్తంలో హైలెట్ గా కనిపించింది బండ్ల గణేశ్. జేబు దొంగ క్యారెక్టర్ లో ఎంటరైన బండ్ల.. బ్రదర్ సెంటిమెంట్ తో మహేశ్ పై ఫైట్ చేయడానికి రెడీ అయిపోతాడు. అక్కడ మహేశ్-బండ్ల మధ్య సీన్లను అంతగా వర్కౌట్ చేయలేకపోయాడు డైరక్టర్.
పూర్తి ఫన్ తో నిండిపోయిన పర్‌ఫార్మెన్స్ చేసిన బండ్ల గణేశ్ కూడా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దానిని క్లారిఫై చేస్తూ బండ్ల కూడా మరోసారి ఇలాంటి చీప్ రోల్స్ చేయనని చెప్పేశాడు. పొలిటికల్ కెరీర్లో బ్లేడ్ గురించి చేసిన కామెంట్లు సీన్లలో పెట్టేసి వర్కౌట్ అవుతాయని భావించిన డైరక్టర్ కు తిప్పలు తప్పలేదు.
కొందరు విమర్శకులు ఆ పాత్రలో బండ్ల గణేశ్ లేకపోయినా.. మహేశ్ అలాంటి కామెడీ చేయకుండా ఉండాల్సిందంటూ అభిప్రాయపడుతున్నారు.
Read Here>>విశాల్ హీరో కాదు.. విలన్.. రహస్యాలను బయటపెడుతా!