Bigg Boss Telugu OTT: నాగార్జున కాదా?.. న్యూ హోస్ట్‌గా యాంకర్ రవి?

బుల్లితెరపై రియాలిటీ షో బిగ్‌బాస్‌ ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. ఈ షో కోసం ప్రత్యేకంగా ఓ అభిమాన వర్గం ఏర్పడడమే కాకుండా.. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ షోగా నిలిచిది.

Bigg Boss Telugu OTT: నాగార్జున కాదా?.. న్యూ హోస్ట్‌గా యాంకర్ రవి?

Bigg Boss Telugu Ott

Updated On : February 22, 2022 / 4:33 PM IST

Bigg Boss Telugu OTT: బుల్లితెరపై రియాలిటీ షో బిగ్‌బాస్‌ ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. ఈ షో కోసం ప్రత్యేకంగా ఓ అభిమాన వర్గం ఏర్పడడమే కాకుండా.. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ షోగా నిలిచిది. కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఈ షో విజయవంతంగా రన్ అవుతూ సీజన్ల మీద సీజన్లు మొదలవుతున్నాయి. ఇప్పటికే టీవీలో తెలుగు బిగ్ బాస్ ఐదు సీజన్లు పూర్తి చేసుకోగా ఫిబ్రవరి 26 నుండి 24 గంటలు ప్రసారమయ్యే బిగ్ బాస్ షో తెలుగు ఓటీటీ షో కూడా మొదలు కానుంది.

Bigg Boss OTT Telugu: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ ప్రోమో రిలీజ్

ఓటీటీ బిగ్ బాస్ షోకు కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నాడని స్వయంగానే ఆయనే చెప్పాడు. అయితే.. 24 గంటలు ప్రసారమయ్యే షో కావడం.. ఫార్మేట్ కూడా మారడంతో హోస్ట్ గా ఎక్కువ టైం కేటాయించాల్సి ఉంది. దీంతో నాగార్జున లాంటి సీనియర్ బిజీ హీరో అంత టైం ఒక షో కోసం ఇవ్వగలరా అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే.. ఇప్పుడు నాగార్జున ఓటీటీ షో నుండి హోస్ట్ గా తప్పుకున్నారని.. ఆ స్థానంలో మరో టీవీ యాంకర్ హోస్ట్ గా వ్యవహరించనున్నాడని టాక్ నడుస్తుంది.

Bigg Boss : హిందీ బిగ్‌బాస్ విన్నర్ ఎవరో తెలుసా?.. విన్నర్‌కి క్యాష్‌ ప్రైజ్‌తో పాటు..

బుల్లి తెర మీద స్టార్ యాంకర్లలో రవి కూడా ఒకడు. ఈటీవీ ఆ టీవీ అని లేకుండా అన్ని ఛానెళ్లలో పలు షోలలో కనిపిస్తూ రవి బిజీగానే ఉంటాడు. గత బిగ్ బాస్ సీజన్ లో కూడా కనిపించిన రవి అనూహ్యంగా ఎలిమినేషన్ కావడం కూడా పెద్ద దుమారం రేగింది. కాగా.. ఇప్పుడు అదే బిగ్ బాస్ షోకు యాంకర్ గా వ్యవహరించనున్నాడని సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారం జరుగుతుంది. అయితే.. ఇది ఎంత మాత్రం వాస్తవం కాదని.. బిగ్ బాస్ లాంటి షోకు స్టార్ స్టేటస్ తో పాటు క్రేజ్ ఉన్న హీరోలనే హోస్ట్ గా తీసుకుంటారని రవి హోస్ట్ అనేది వాస్తవం కాదని కూడా బిగ్ బాస్ అభిమానులు వాదిస్తున్నారు. మరి ఇందులో నిజమవుతుందో షో మొదలైతే కానీ తెలియదు.