NRI-నాయనా..! రారా ఇంటికి

శ్రీనివాస్ అవసరాల, లక్ష్మీ మంచు, మహతి, నాగబాబు మెయిన్ లీడ్స్‌గా రూపొందనున్న ఎన్నారై.. నాయనా..! రారా ఇంటికి..

  • Published By: sekhar ,Published On : February 18, 2019 / 12:02 PM IST
NRI-నాయనా..! రారా ఇంటికి

శ్రీనివాస్ అవసరాల, లక్ష్మీ మంచు, మహతి, నాగబాబు మెయిన్ లీడ్స్‌గా రూపొందనున్న ఎన్నారై.. నాయనా..! రారా ఇంటికి..

శ్రీనివాస్ అవసరాల.. నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, రైటర్, డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. శ్రీనివాస్ ఫుల్ లెంగ్త్ హీరోగా చేసిన బాబు బాగా బిజీ నిరాశ పరిచింది. ఇప్పుడు శ్రీనివాస్ అవసరాల, లక్ష్మీ మంచు, మహతి, నాగబాబు మెయిన్ లీడ్స్‌గా ఒక సినిమా రూపొందబోతుంది. ప్రదీప్ కెఆర్ నిర్మిస్తుండగా, బాల రాజశేఖరుని డైరెక్ట్ చెయ్యనున్నాడు. ఈ మూవీకి ఎన్నారై.. నాయనా..! రారా ఇంటికి అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఫిబ్రవరి 20 న సినిమా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది.

ఫిబ్రవరి 20 వ తేదీ, ఉదయం 11:30 గంటలకు, అన్నపూర్ణ స్టూడియోలో, పూజా కార్యక్రమాలతో ఎన్నారై స్టార్ట్ కాబోతుంది. ఈ సినిమాకి కెమెరా : వెంకట్ సి దిలీప్, మ్యూజిక్ : యోగేశ్వర శర్మ, లిరిక్స్ : సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఎడిటింగ్ : చోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : సింధూజ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిరణ్ కుమార్.