క‌రోనాపై పోరుకి యంగ్ టైగ‌ర్, సుప్రీం హీరో సాయం..

క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌కు విరాళాలు ప్రకటించిన ఎన్టీఆర్, సాయి ధరమ్ తేజ్..

  • Published By: sekhar ,Published On : March 26, 2020 / 03:29 PM IST
క‌రోనాపై పోరుకి యంగ్ టైగ‌ర్, సుప్రీం హీరో సాయం..

Updated On : March 26, 2020 / 3:29 PM IST

క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌కు విరాళాలు ప్రకటించిన ఎన్టీఆర్, సాయి ధరమ్ తేజ్..

క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) నిర్మూల‌న‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధ ప్ర‌తిపాదిక‌న చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. టాలీవుడ్‌కి చెందిన ప‌లువురు స్టార్స్ ఇప్ప‌టికే త‌మ వంతు సాయంగా విరాళాల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీర్ రూ.75ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు.

75ల‌క్ష‌ల విరాళం మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధికి చెరో రూ.25ల‌క్ష‌లు అంటే రెండు రాష్ట్రాల‌కు రూ.50 ల‌క్ష‌ల విరాళంతో పాటు మ‌రో రూ.25 ల‌క్ష‌ల‌ను క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఉపాధి కోల్పోయిన రోజువారీ సినీ పేద క‌ళాకారుల‌కు అంద‌చేస్తున్నారు తారక్.

తాజాగా సుప్రీమ్ హీరో సాయితేజ్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధికి త‌న వంతుగా రూ.10 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు. ‘‘మనం ఇది వరకు మనం చూడనటువంటి శత్రువుతో యుద్ధం చేస్తున్నాం. దాని కోసం మనం అందరం కలిసే ఉన్నాం. అలాగే మనం ఆ యుద్ధంలో విజయం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సహాయ నిధికి నా వంతుగా రూ.10 లక్ష‌ల విరాళాన్ని అందిస్తున్నాను.. ఇంట్లోనే ఉండండి.. జాగ్ర‌త్త‌గా ఉండండి’’అని తెలిపారు సాయితేజ్‌.