Mad Collections : ఎన్టీఆర్ బామ్మర్ది మొదటి సినిమాతో అదరగొట్టాడు.. మూడు రోజుల్లో కలెక్షన్స్..

జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ నటించిన మొదటి సినిమా ‘మ్యాడ్’ కలెక్షన్స్ అదరగొట్టేస్తుంది.

Mad Collections : ఎన్టీఆర్ బామ్మర్ది మొదటి సినిమాతో అదరగొట్టాడు.. మూడు రోజుల్లో కలెక్షన్స్..

NTR cousin Narne Nithin sangeeth shobhan Mad Movie Collections

Updated On : October 9, 2023 / 2:57 PM IST

Mad Collections : జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్, హీరో సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరి ప్రియా, అనంతిక, గోపిక ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘మ్యాడ్’. కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ తెరకెక్కించాయి. ట్రైలర్, టీజర్ తో యూత్ ని బాగా ఆకట్టుకుంది. చాలా కాలం తరువాత కాలేజీ స్టూడెంట్ లైఫ్ బ్యాక్‌డ్రాప్ తో ఈ మూవీ తెరకెక్కడంతో కాలేజీ స్టూడెంట్స్ అంతా మూవీ పై మంచి ఆసక్తి చూపించారు.

దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని నమోదు చేస్తూ ముందుకు వెళ్తుంది. అక్టోబర్ 6న రిలీజ్ అయిన ఈ మూవీ రోజురోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ వచ్చింది. ఇక మొదటి వీకెండ్ పూర్తి అయ్యేపాటికి.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.8.4 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్లు నిర్మాతలు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రానికి ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం నిర్మాతలను ఆనందానికి గురి చేస్తుంది. ఇక ఇది ఎన్టీఆర్ బామ్మర్ది మొదటి సినిమా కావడం, మూడు రోజుల్లోనే మూవీకే ఈ రేంజ్ కలెక్షన్స్ రావడంతో ఎన్టీఆర్ అభిమానులు నార్నె నితిన్ కి అభినందనలు తెలియజేస్తున్నారు.

Also read : Yatra 2 : యాత్ర 2 ఫస్ట్ లుక్ వచ్చేసింది.. వైఎస్ఆర్‌గా మమ్ముట్టి.. వైఎస్‌ జ‌గ‌న్ పాత్ర‌లో జీవా..

ఇక సినిమా కథ విషయానికి వస్తే.. కాలేజీలో ముగ్గురు స్టూడెంట్స్, వాళ్ళతో పాటు చుట్టూ ఉండే స్టూడెంట్స్, సీనియర్స్, కాలేజీ స్టాఫ్ చేసే అల్లరి, కాలేజీలో గొడవలు, చదువులు.. అన్ని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా చూపించారు. గతంలో వచ్చిన కాలేజీ బేస్డ్ సినిమాల్లో ఎమోషన్స్, మెసేజ్ లు ఉంటాయి. కానీ ఈ సినిమాలో మాత్రం కేవలం కామెడీ మాత్రమే ఉంటుంది. సంగీత్ శోభన్ తో పాటు విష్ణు అనే మరో నటుడు సినిమా మొత్తంలో ఇద్దరూ కలిసి చేసిన ఎంటర్టైన్మెంట్ తో సినిమాని ఇంకో రేంజ్ కి తీసుకెళ్లారు.