Devara : ‘దేవర’ షార్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది చూశారా.. సముద్రంలో రక్త కెరటాలు..

'దేవర' గ్లింప్స్ రిలీజ్ డేట్ ని చెప్పారు గాని కరెక్ట్ టైం చెప్పలేదు. తాజాగా ఆ టైంని అనౌన్స్ చేస్తూ ఒక నాలుగు సెకన్ల షార్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.

Devara : ‘దేవర’ షార్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది చూశారా.. సముద్రంలో రక్త కెరటాలు..

NTR Devara team announce glimpse release time with short video

Updated On : January 6, 2024 / 5:45 PM IST

Devara : కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడం నిర్మాతగా వ్యవహరిస్తున్న కళ్యాణ్ రామ్ ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. కాగా ఈ సంక్రాంతికి అభిమానులకు కనుక ఇచ్చేందుకు మూవీ నుంచి గ్లింప్స్ ని తీసుకు వస్తున్నారు.

జనవరి 8న ఈ మూవీ గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే డేట్ ని చెప్పారు గాని కరెక్ట్ టైం చెప్పలేదు. తాజాగా ఆ టైంని అనౌన్స్ చేస్తూ ఒక నాలుగు సెకన్ల షార్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్ లో ఎన్టీఆర్ తన ఆయుధాన్ని పట్టుకొని సముద్రంలో రక్తాన్ని కడుగుతూ కనిపించారు. ఆ రక్తంతో మొత్తం కెరటాలు అంతా ఎర్రగా కనిపిస్తున్నాయి. ఇక ఇది చూసిన ఆడియన్స్ కి 8న రాబోయే గ్లింప్స్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి.

కాగా ఈ గ్లింప్స్ ని జనవరి 8న సాయంత్రం 4:05 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. మరి ఆ గ్లింప్స్ తో ఎలాంటి అంచనాలను క్రియేట్ చేయబోతున్నారో చూడాలి. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ గ్లింప్స్ కి అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రెడీ చేసినట్లు తెలుస్తుంది. అభిమానులంతా కూడా అనిరుద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు.

Also read : Ram Charan : బాబోయ్ బాబాయ్ కంటే సింపుల్‌గా ఉన్నాడుగా రామ్ చరణ్.. ఒకే షర్ట్‌ని 8 ఏళ్ళుగా..

ఇక రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి పార్ట్ ని 5 ఏప్రిల్ 2024లో రిలీజ్ చేస్తామని తెలిపారు. దేవర సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్, మలయాళం స్టార్ షైన్ టామ్ చాకో లు విలన్స్ గా కనపడబోతున్నారు.