Ram Charan : బాబోయ్ బాబాయ్ కంటే సింపుల్‌గా ఉన్నాడుగా రామ్ చరణ్.. ఒకే షర్ట్‌ని 8 ఏళ్ళుగా..

బాబోయ్ బాబాయ్ కంటే చాలా సింపుల్‌గా ఉన్నాడుగా అబ్బాయి రామ్ చరణ్. ఒకే షర్ట్‌ని గత 8 ఏళ్ళుగా..

Ram Charan : బాబోయ్ బాబాయ్ కంటే సింపుల్‌గా ఉన్నాడుగా రామ్ చరణ్.. ఒకే షర్ట్‌ని 8 ఏళ్ళుగా..

Game Changer star Ram Charan wear same shirt from past eight years

Updated On : January 6, 2024 / 4:46 PM IST

Ram Charan : మెగా ఫ్యామిలీలోని బాబాయ్ అబ్బాయిలు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఎంత సింపుల్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి సూపర్ స్టార్‌డమ్ ని అందుకున్నా.. ఈ ఇద్దరు ఎంతో ఒదిగి ఉంటారు. వీరిద్దరిలో ఈ పోలిక చాలా సందర్భాల్లో బయటపడడమే కాదు.. చిరంజీవి, నాగబాబు వంటి వారు కూడా ఆ పోలిక గురించి మాట్లాడడం చాలాసార్లే విన్నాం.

ఇటీవల వరుణ్ తేజ్ పెళ్లి రాయల్ ప్యాలస్ లో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఆ పెళ్ళిలో ప్రతి ఒక్కరు రాయల్ వెడ్డింగ్ కి తగ్గట్టు డ్రెస్సింగ్ చేసుకుంటే.. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ మాత్రం చాలా సింపుల్ గా కనిపించారు. ఆ సమయంలో అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ఇక తాజాగా మరో ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఫొటోలో రామ్ చరణ్ షర్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.

Also read: Ram Charan : రామ్ చరణ్ RC16 మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయా.. ఫోటో వైరల్

రీసెంట్ గా రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి దిగిన ఫోటో ఒకటి బయటకి వచ్చింది. ఆ ఫొటోలో రామ్ చరణ్ గ్రీన్ గ్రే కలర్ చెక్ షర్ట్ వేసుకొని కనిపించారు. అయితే రామ్ చరణ్ ఈ షర్ట్ ని గతంలో కూడా పలుమార్లు ధరించి కనిపించారు. 2016లో ‘ధృవ’ సినిమాలో అదే షర్ట్ ని రామ్ చరణ్ ధరించి కనిపిస్తారు. ఆ తరువాత ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ సమయంలో, ప్రమోషన్స్ సమయంలో, లాక్ డౌన్ టైములో కూడా చరణ్ అదే షర్ట్ ధరించి పలుమార్లు కనిపించారు.

ఒక పెద్ద స్టార్ హీరో అయ్యుండి, గత 8 ఏళ్ళుగా ఒకే షర్ట్‌ని ఉపయోగిస్తూ కనిపించిన రామ్ చరణ్ ని చూసి.. మరింత సింపుల్సిటీనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అబ్బాయి బాబాయ్ కంటే సింపుల్‌గా ఉన్నాడుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు పై మీమ్స్ చేస్తూ మీమర్స్ వైరల్ చేస్తున్నారు. మరి రామ్ చరణ్ ధరించిన ఆ షర్ట్ ఏంటో మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

 

View this post on Instagram

 

A post shared by fasak.boss (@fasakboss)