వైరల్ అవుతున్న పంజాబీ ఎన్టీఆర్ పిక్
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని పోలిన షమీందర్ సింగ్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని పోలిన షమీందర్ సింగ్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు..
సాధారణంగా ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. ఏడుగురు సంగతేమో కానీ, మన పోలికలతో ఉన్న ఒక్క మనిషి మనకి కనబడ్డా ఆశ్చర్యపోతాం. ఇక సెలబ్రిటీల పోలికలతో ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళని కూడా చిన్నసైజు సెలబ్రిటీల్లానే చూస్తాం.. ఇప్పుడీ టాపిక్ ఎందుకొచ్చిందంటే, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని పోలిన వ్యక్తి ఒకతను సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. పంజాబ్‌కి చెందిన ఇతగాడి పేరు షమీందర్ సింగ్, ఎన్టీఆర్‌కి వీరాభిమాని.. తన అభిమాన హీరో పోలికలుండటం షమీందర్కి ప్లస్ అయ్యింది. ఈ మధ్య ఓ టిక్ టాక్ వీడియోతీసి, దాన్ని ట్విట్టర్లో పోస్ట్ చెయ్యడంతో షమీందర్ సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయాడు.
ఎన్టీఆర్ టిక్ టాక్ వీడియో చెయ్యడమేంటబ్బా అని మొదట్లో చాలామంది ఆశ్చర్యపోయారు. ‘నా పేరు షమీందర్ సింగ్, మాది పంజాబ్, నాకు ఎన్టీఆర్ సార్ అంటే చాలా ఇష్టం, నాకు తెలగు రాదు కానీ, ఆయణ్ణి కలవాలనుంది.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నాకు చాలా మెసేజ్‌లు చేస్తుంటారు.. నేను తారక్‌ని కలవడానికి హైదరాబాద్ వస్తే, జనాలు నేనే ఎన్టీఆర్ అనుకుని వెంటపడతారేమోనని భయంగా ఉంది’ అని చెప్తూ, తన వీడియోలకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లకు పీఆర్వోగా వ్యవహరించే మహేష్ కోనేరుని ట్యాగ్ చేస్తున్నాడు షమీందర్ సింగ్.. అచ్చు తన పోలికలతో ఉన్న తన వీరాభిమాని గురించి తారక్ ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి మరి.
Real or fake @Troll_Tollywood @tarak9999 @1ShaminderSingh @RGVzoomin @NTVJustIn @TV9Telugu pic.twitter.com/A4dySwipR8
— Shaminder Singh (@1ShaminderSingh) May 12, 2019