War 2 : ‘దేవర’తో పాటు ‘వార్ 2’ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్.. ఎన్టీఆర్ హృతిక్‌తో కలిసి బాలీవుడ్ తెరపై కనపడేది అప్పుడే..

ఇవాళే ఎన్టీఆర్ దేవర సినిమా వాయిదా వేస్తూ అక్టోబర్ 10 రిలీజ్ కాబోతుందని చిత్రయూనిట్ తెలిపారు. మరో వైపు వార్ 2 రిలీజ్ డేట్ కూడా బాలీవుడ్ లో వైరల్ అవుతుంది.

NTR Hrithik Roshan Bollywood Movie War 2 Release Update

NTR Hrithik Roshan : హృతిక్ రోషన్ ఇటీవలే ఫైటర్ సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. నెక్స్ట్ వార్ సినిమాకు సీక్వెల్ గా వార్ 2(War 2) సినిమాతో రాబోతున్నాడు హృతిక్. ఈ సినిమాని యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో తెరకెక్కిస్తున్నారు. ఇక వార్ 2 సినిమాతో మన ఎన్టీఆర్ బాలీవుడ్(Bollywood) కి పరిచయం కాబోతున్నాడు. త్వరలోనే వార్ 2 సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు.

అయితే ఇటీవల హృతిక్ జిమ్ లో కష్టపడుతూ గాయపడ్డాడు. దానికి సంబంధించిన ఫొటో కూడా షేర్ చేయడంతో హృతిక్ అభిమానులు బాధపడగా, వార్ 2 లేట్ అవుతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా నిరాశ చెందారు. ఇవాళే ఎన్టీఆర్ దేవర(Devara) సినిమా వాయిదా వేస్తూ అక్టోబర్ 10 రిలీజ్ కాబోతుందని చిత్రయూనిట్ తెలిపారు. మరో వైపు వార్ 2 రిలీజ్ డేట్ కూడా బాలీవుడ్ లో వైరల్ అవుతుంది.

Also Read : Anasuya : 24 ఏళ్ళ క్రితం.. NCC కమాండర్‌గా అనసూయ.. వైరల్ అవుతున్న ఫోటో..

ప్రస్తుతం హృతిక్ కోలుకుంటున్నాడని, ఫిబ్రవరి 23 నుంచి వార్ 2 షూటింగ్ మొదలవుతుందని, అప్పుడు హృతిక్ షూట్ లో జాయిన్ అవుతాడని చిత్రయూనిట్ నుంచి సమాచారం. ఈ రెగ్యులర్ షూట్ లో మొదట రెండు వారాల షూట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ దేవర షూట్ అయ్యాక వార్ 2కి డేట్స్ ఇస్తాడని సమాచారం. దీంతో ఈ సంవత్సరం చివరికల్లా షూటింగ్ పూర్తిచేసి, వచ్చే సంవత్సరం పోస్ట్ ప్రొడక్షన్, VFX వర్క్స్ చూసుకొని వచ్చే సంవత్సరం ఆగష్టులో ఇండిపెండెన్స్ డే కానుకగా వార్ 2 సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు బాలీవుడ్ సమాచారం. దీంతో ఎన్టీఆర్ బాలీవుడ్ తెరపై వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డేకి కనపడనున్నాడు. ఒకే రోజు దేవర, వార్ 2 అప్డేట్స్ రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు