NTR : ఎట్టకేలకు ఆస్కార్‌కు ఎన్టీఆర్ ప్రయాణం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో జోష్..
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 'నాటు నాటు' సాంగ్ తో ఆస్కార్ బరిలో కూడా ఈ చిత్రం స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో చిత్ర యూనిట్ ఆస్కార్ క్యాంపెన్ నిర్వహిస్తూ గత కొంత కాలంగా అమెరికాలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్ అమెరికా ప్రమోషన్స్ లో పాల్గొంటుండగా..

ntr is heading to america for oscar awards
NTR : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ భారీ మల్టీస్టార్రర్ చిత్రం ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా సాధించిన ఘనతలను సాధించి చరిత్ర సృష్టిస్తుంది. ఇక బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ సాంగ్ తో ఆస్కార్ బరిలో కూడా ఈ చిత్రం స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో చిత్ర యూనిట్ ఆస్కార్ క్యాంపెన్ నిర్వహిస్తూ గత కొంత కాలంగా అమెరికాలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
NTR30 : ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలెర్ట్.. ఈరోజు NTR30 అప్డేట్ రాబోతుంది..
ఇప్పటికే రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్ అమెరికా ప్రమోషన్స్ లో పాల్గొంటుండగా.. తారకరత్న మరణం వల్ల ఎన్టీఆర్ అమెరికాకు రామ్ చరణ్ తో కలిసి వెళ్లలేక పోయాడు. దీంతో పలు ప్రముఖ ఇంటర్వ్యూల్లో, అవార్డు పురస్కారాల్లో రామ్ చరణ్ ఒక్కడే పాల్గొనడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. ఇక తారకరత్న పెద్దకర్మ కూడా పూర్తి కావడంతో ఎన్టీఆర్ ఇప్పుడు అమెరికా బయలుదేరాడు. ఈరోజు (మార్చి 6) ఉదయం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి అమెరికా బయలుదేరాడు. ఇక ఈ వార్త తెలియడంతో ఎన్టీఆర్ అభిమానులు హ్యాపీ ఫీల్ అవుతున్నారు.
కాగా మార్చి 12న రాత్రి ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. ఇండియన్ టైం ప్రకారం మార్చి 13న ఉదయం ఈ అవార్డుల కార్యక్రమం ఉంటుంది. సినిమాలో నాటు నాటు సాంగ్ పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, కీరవాణితో కలిసి ఆస్కార్ స్టేజి పై లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. అలాగే నాటు నాటు సాంగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉండబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ అండ్ చరణ్ ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తారా? లేదా మరొకరా? అనేది సస్పెన్స్ నెలకుంది. ఇక ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఈ పాట ఆస్కార్ అందుకోవడం కూడా పక్కా అంటున్నారు.
Man of Masses #NTR off to the USA, for attending Oscar Awards. @tarak9999 #NTRGoesGlobal #ManOfMassesNTR #RRR pic.twitter.com/Q1UVf4zFfV
— BA Raju’s Team (@baraju_SuperHit) March 6, 2023