Devara Song : ‘దేవర’ నుంచి మరో పోస్టర్.. దేవర రొమాంటిక్ సాంగ్ రిలీజ్ టైం ఎప్పుడంటే..
ఈ సాంగ్ నుంచి రెండు పోస్టర్స్ రిలీజ్ చేయగా తాజాగా మూడో పోస్టర్ రిలీజ్ చేశారు.
Devara Song : కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కుతున్న దేవర సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. రెండు పార్టులతో దేవర సినిమా తెరకెక్కుతుండగా మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే దేవర సినిమా నుంచి ఓ మాస్ గ్లింప్స్, మాస్ సాంగ్ రిలీజ్ చేయగా నేడు ఆగస్టు 5న ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మీద తెరకెక్కించిన ఓ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ని విడుదల చేస్తామని ప్రకటించారు.
Also Read : Niharika Konidela : నిహారిక కోసం రాబోతున్న మెగా బావబామ్మర్దులు.. ఆ హీరో కూడా..
ఇప్పటికే ఈ సాంగ్ నుంచి రెండు పోస్టర్స్ రిలీజ్ చేయగా తాజాగా మూడో పోస్టర్ రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ లో ఎన్టీఆర్, జాన్వీ మరో రొమాంటిక్ స్టిల్ ని చూపించారు. ఇక దేవర రొమాంటిక్ సాంగ్ నేడు ఆగస్టు 5 సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ పాటని విడుదల చేయనున్నారు.
ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా అనిరుద్ సంగీతం అందించాడు. దీంతో ఫ్యాన్స్ ఈ రొమాంటిక్ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు.
We are already in its trance….Bloody sure you too will join us in this ride from 5:04PM ??#DevaraSecondSingle #Chuttamalle #DheereDheere #Paththavaikkum #SwaathimuttheSikkangaithe #KanninathanKamanottam #Devara #DevaraonSep27th pic.twitter.com/v4hyJx3rMk
— Devara (@DevaraMovie) August 5, 2024