ప్రేక్షకుల ముందుకు ’ఎన్టీఆర్ కథానాయకుడు’

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయడు జనవరి 9 బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

  • Published By: veegamteam ,Published On : January 9, 2019 / 02:22 AM IST
ప్రేక్షకుల ముందుకు ’ఎన్టీఆర్ కథానాయకుడు’

Updated On : January 9, 2019 / 2:22 AM IST

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయడు జనవరి 9 బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

హైదరాబాద్ : స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయడు జనవరి 9 బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పండుగ సమయం కావడం, ఈ సినిమాకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో బెన్ ఫిట్ షోలు ప్రదర్శించేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. దీంతో అర్ధరాత్రే కొన్ని థియేటర్లలో బెన్ ఫిట్ షోలను ప్రదర్శించారు. ఈలలు, కేరింతలతో థియోటర్లు మారుమోగుతున్నాయి.

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని ఎన్ బీకే ఫిల్మ్స్ వారాహి చలన చిత్రం విబ్రిమీడియా బ్యానర్స్ పై బాలకృష్ణ, సాయికొర్రపాటి, విష్ణుఇంటూరి నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సతీమణిగా విద్యాబాలన్ నటిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రానికి కంచె, గౌతమీపుత్రశాతకర్ణి సినిమాల దర్శకుడు క్రిష్ జాగర్లపూడి దర్శకత్వం, ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు.
ఇటు హైదరాబాద్ లోనూ కథనాయకుడు ఫీవర్ కనిపిస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి భాగం రిలీజ్ కావడంతో బాలకృష్ణ సంతోషంలో మునిగిపోయారు. బెన్ ఫిట్ షో చూసేందుకు భారీగా అభిమానులు వచ్చారు. కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్ వద్ద నెలకొంది. బాలయ్యబాబులో ఎన్టీఆర్ ను చూసుకుంటున్నామని అభిమానులు అంటున్నారు. ఈ సంక్రాంతి బాలయ్యదే అంటున్నారు.

నెల్లూరులో బాలకృష్ణ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఎన్టీఆర్ కథానాయకుడు థియోటర్లలో సందడి చేస్తోంది. ఎన్టీఆర్ కథనాయకుడు థియోటర్లకు ఫ్యాన్స్ క్యూ కట్టారు. నెల్లూరులోని థియేటర్లలో అభిమానులతోపాటు పలువురు ఏపీ మంత్రులు బెన్ ఫిట్ షోలు చూశారు.