చిరుకి థ్యాంక్స్ తెలిపిన తారక్..
సోషల్ మీడియా ద్వారా మెగాస్టార్ చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆర్..

సోషల్ మీడియా ద్వారా మెగాస్టార్ చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆర్..
మెగాస్టార్ చిరంజీవి, మార్చి 25న ఉగాది పర్వదినం సందర్భంగా పలు సోషల్ మీడియా మాద్యమాల్లోకి అఫీషియల్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఎంట్రీ పై పలువురు ప్రేక్షకులు, మెగా ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుండగా, కొందరు సినిమా ప్రముఖులు ఆయనను సోషల్ మీడియాలోకి సాదరంగా స్వాగతం పలుకుతూ తమ అకౌంట్స్ ద్వారా అభినందనలు తెలుపుతున్నారు.
ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాస్టార్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఉగాది సందర్భంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘రౌద్రం రణం రుధిరం’ టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. టైటిల్ మోషన్ పోస్టర్‌కు ప్రేక్షకులు, అభిమానులు మరియు సెలబ్రిటీల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి ‘‘మోషన్ పోస్టర్ కనువిందుగా ఉంది. నా ఒళ్లు గగుర్పొడిచింది. కీరవాణి అద్భుతమై నేపథ్య సంగీతాన్ని అందించారు. రాజమౌళి, చరణ్, తారక్ పనితీరు అద్భుతంగా ఉంది. ఈ ఉగాది రోజున అందరిలో ఎనర్జీని నింపారు’’ అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ‘సర్.. ఈ ప్రశంస ఎంతో విలువైనది.. ట్విట్టర్‌కు స్వాగతం’ అంటూ తారక్ రిప్లై ఇచ్చాడు. ‘కరోనా అవైర్‌నెస్‌కు సంబంధించి చరణ్‌తో కలిసి వీడియో ఎఫెక్టివ్‌గా ఉంది’ అంటూ చిరు అభినందించారు.
Thank you dear Taarak @tarak9999 Also the corona awareness video that you and @AlwaysRamCharan did is truly effective. Appreciate your timely initiative. https://t.co/3GvB5L7xe9
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 26, 2020