కళ్యాణ్ రామ్ కోసం తారక్

  • Published By: vamsi ,Published On : January 5, 2020 / 08:29 AM IST
కళ్యాణ్ రామ్ కోసం తారక్

Updated On : January 5, 2020 / 8:29 AM IST

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘ఎంత మంచివాడవురా’ సినిమా సంక్రాంతి బరిలో ఉంది. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 15వ తేదీన విడుదలకు సిద్ధం అవుతుంది.

ఈ క్రమంలోనే సంక్రాంతికి విడుదలవుతున్న మిగిలిన చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమా పబ్లిసిటీ విషయంలో కాస్త వెనకబడింది. అయితే ఆ లోటును తీర్చేందుకు తమ్ముడు తారక్ వచ్చేస్తున్నాడు. తన అన్న కళ్యాణ్ రామ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా వస్తున్నాడు.
 
జనవరి 8వ తేదీన జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరవుతున్నాడు ఎన్టీఆర్. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ హాల్‌లో ఈ ఈవెంట్‌ జరగనుంది. ఎన్టీయార్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతుండడంతో సినిమాకు మంచి హైప్ వస్తుందని చిత్రయూనిట్ నమ్మకంగా ఉంది.