NV Prasad : సోషల్ మీడియాలో చిరంజీవిపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం కాదు.. నా ముందుకొచ్చి మాట్లాడండి..

నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. ''ఆచార్య సినిమా కోసం చిరంజీవి ఎన్నో త్యాగాలు చేశారు. ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి ఓ డేట్ అడిగితే చిరంజీవి వెంటనే ఆయనకు ఆచార్య.......

NV Prasad : సోషల్ మీడియాలో చిరంజీవిపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం కాదు.. నా ముందుకొచ్చి మాట్లాడండి..

Nv Prasad

Updated On : April 24, 2022 / 3:18 PM IST

 

NV Prasad :  చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా ఈనెల 29న విడుదల అవ్వనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి రాజమౌళి ముఖ్య అతిధిగా రాగా మెగా అభిమానులతో పాటు చిత్ర యూనిట్, పలువురు ప్రముఖులు కూడా ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. చిరంజీవితో తర్వాతి సినిమాలు తీయబోయే డైరెక్టర్లు, నిర్మాతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

చిరంజీవి నెక్స్ట్ సినిమా ‘గాడ్ ఫాదర్’ని నిర్మిస్తున్న నిర్మాతల్లో ఒకరైన ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. ”ఆచార్య సినిమా కోసం చిరంజీవి ఎన్నో త్యాగాలు చేశారు. ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి ఓ డేట్ అడిగితే చిరంజీవి వెంటనే ఆయనకు ఆచార్య ఆపి డేట్ ఇచ్చారు. ఎవరో ఎన్నెన్నో మాట్లాడుతుంటారు. కానీ ఇవాళ ఇండస్ట్రీ బతికిందంటే అది చిరంజీవి వల్లే. ఊరికే బయట మాట్లాడటం, సోషల్ మీడియాలో మాట్లాడటం కాదు ఎవరైనా సరే నా ముందుకు వచ్చి మాట్లాడండి. నేను సమాధానం ఇస్తాను. తెలుగు ఇండస్ట్రీ ఇవాళ నెంబర్ వన్ ప్లేసుకు వెళ్లిందంటే దానికి ఇన్ని సంవత్సరాలుగా చిరంజీవి గారు చేసిన కృషి ఎంతో ఉంది. నా సినిమా ఈవెంట్ లో ఇంకా మాట్లాడతాను” అని అన్నారు.

Will Smith : సడెన్‌గా భారతదేశానికి వచ్చిన విల్ స్మిత్.. ఎందుకో??

అయితే ఈయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇటీవల మా ఎలెక్షన్స్ టైంలో ఆ తర్వాత చిరంజీవి పై కొంతమంది విమర్శలు చేశారు. దీనిని ఉద్దేశించి ఈయన అలా మాట్లాడారని అంటున్నారు. అయితే తన సినిమా ఈవెంట్ లో చిరంజీవి గారి గురించి, ఆయన్ని అనేవారి గురించి ఇంకా మాట్లాడతాను అన్నారు. మరి గాడ్ ఫాదర్ ఈవెంట్ లో ఇంకెన్ని మాట్లాడతారో చూడాలి. మలయాళంలో హిట్టైన ‘లూసిఫర్’ సినిమాను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో మోహన రాజా దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ రీమేక్‌ చేస్తున్నారు. చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.