O Cheliya : ఓ.. చెలియా మెలోడీ సాంగ్ రిలీజ్.. నవీన్ చంద్ర చేతుల మీదుగా..

ఈ మెలోడీ సాంగ్ ని నవీన్ చంద్ర చేతుల మీదుగా రిలీజ్ చేసారు. (O Cheliya)

O Cheliya : ఓ.. చెలియా మెలోడీ సాంగ్ రిలీజ్.. నవీన్ చంద్ర చేతుల మీదుగా..

O Cheliya

Updated On : October 5, 2025 / 2:08 PM IST

O Cheliya : SRS మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రూపాశ్రీ కొపురు నిర్మాణంలో ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఓ.. చెలియా’. నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా మరో మెలోడీ సాంగ్ రిలీజ్ చేసారు.(O Cheliya)

ఈ మెలోడీ సాంగ్ ని నవీన్ చంద్ర చేతుల మీదుగా రిలీజ్ చేసారు. కొంచెం కొంచెంగా.. అంటూ సాగే మెలోడీ పాటను ఎంఎం కుమార్ సంగీత దర్శకత్వంలో సుధీర్ బగాడి రాయగా వాగ్దేవి, మనోజ్ పాడారు. మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..

Also Read : Constable Song : వరుణ్ సందేశ్ ‘కానిస్టేబుల్’ నుంచి ఐటెం సాంగ్ చూశారా..? సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

ఈ సాంగ్ రిలీజ్ చేసిన అనంతరం హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ఓ.. చెలియా నుంచి వచ్చిన ఈ సాంగ్ మంచి మెలోడీ గా వినడానికి బాగుంది. ఇందులో హీరో హీరోయిన్లు చక్కగా కనిపిస్తున్నారు. లవ్, థ్రిల్లర్ అన్ని అంశాల్ని కలగలపి సినిమాను తెరకెక్కించారని చెప్పారు. ఇండస్ట్రీలోకి ఇలాంటి కొత్త టీం, కొత్త మేకర్స్ రావాలి అని చెప్తూ మూవీ యూనిట్ కి అల్ ది బెస్ట్ తెలిపారు.

O Cheliya