O Manchi Ghost : ‘ఓ మంచి ఘోస్ట్(OMG)’ రిలీజ్ డేట్ అనౌన్స్.. హారర్ కామెడీతో..
త్వరలో మరో హారర్ కామెడీ సినిమా రాబోతుంది.

O Manchi Ghost OMG Horror Comedy Movie Release Date Announced
O Manchi Ghost : ఇటీవల హారర్ కామెడీ సినిమాలు మంచి హిట్ కొడుతున్నాయి. త్వరలో మరో హారర్ కామెడీ సినిమా రాబోతుంది. వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘ఓ మంచి ఘోస్ట్(OMG)’. మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై డా.అబినికా ఇనాబతుని నిర్మాణంలో శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
ఇప్పటికే ‘ఓ మంచి ఘోస్ట్(OMG)’ సినిమా నుంచి సాంగ్స్, కాన్సెప్ట్ పోస్టర్, టీజర్ రిలీజ్ చేయగా ప్రేక్షకులని మెప్పించాయి. ఈ సినిమాలో నందితా శ్వేతా ఘోస్ట్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ‘ఓ మంచి ఘోస్ట్(OMG)’ సినిమా జూన్ 21న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. మరి ఈ సినిమా ఏ రేంజ్ హారర్ కామెడీతో మెప్పిస్తుందో చూడాలి.