Om Raut : హనుమంతడిపై 2015లో సంచలన ట్వీట్ చేసిన ఓం రౌత్.. ఇప్పుడు సడెన్ గా డిలీట్.. ఫైర్ అవుతున్న నెటిజన్లు.. మరిన్ని ట్రోల్స్..

డైరెక్టర్ ఓం రౌత్ ని టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. అయితే గతంలో ఓం రౌత్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. గతంలో 2015లో ఓం రౌత్ ఓ ట్వీట్ చేశాడు.

Om Raut : హనుమంతడిపై 2015లో సంచలన ట్వీట్ చేసిన ఓం రౌత్.. ఇప్పుడు సడెన్ గా డిలీట్.. ఫైర్ అవుతున్న నెటిజన్లు.. మరిన్ని ట్రోల్స్..

Om Raut deleted 2015 tweet that posted on Hanuman

Updated On : June 17, 2023 / 8:07 PM IST

Om Raut :  తాజాగా ప్రభాస్(Prabhas) నటించిన ఆదిపురుష్(Adipurush) సినిమా రిలీజయిన సంగతి తెలిసిందే. ముందు నుంచి భారీ హోప్స్ ఈ సినిమాపై పెట్టుకున్నారు కానీ రిలీజయ్యాక అంతా రివర్స్ అయింది. రామాయణం(Ramayanam) అని చెప్పి ఏదో తీశారని, పాత్రల ఆహార్యం మార్చేశారని, రామాయణం ఎక్కడా చూపించలేదని, డైలాగ్స్ కూడా సరిగ్గా రాయలేదని, VFX కూడా దారుణంగా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు, నెటిజన్లు ఆదిపురుష్ సినిమాపై, డైరెక్టర్ ఓం రౌత్ పై దారుణంగా విమర్శలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ముఖ్యంగా మరోసారి బాలీవుడ్ ని కూడా విమర్శిస్తున్నారు. డైరెక్టర్ ఓం రౌత్ ని టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. అయితే గతంలో ఓం రౌత్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. గతంలో 2015లో ఓం రౌత్ ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో.. హనుమంతుడికి ఏమన్నా చెవుడా? నా చుట్టూ ఉన్న జనాల్ని చూస్తుంటే అలాగే ఉంది. హనుమాన్ సాంగ్స్ చాలా గట్టిగా సౌండ్ పెట్టి ప్లే చేస్తున్నారు హనుమాన్ జయంతి రోజు. సంబంధం లేని సాంగ్స్ ని కూడా ప్లే చేస్తున్నారు అంటూ రాశాడు. నిన్నటి నుంచి ఓం రౌత్ హిందువుల మనోభావాలు దెబ్బతీసాడని ట్రోల్ చేస్తుండటంతో పాటు ఈ ట్వీట్ వైరల్ గా మారగా మరింత విరుచుకుపడుతున్నారు.

Adipurush Controversy : ఆదిపురుష్‌లోని డైలాగ్స్‌పై మండిప‌డ్డ ముఖ్య‌మంత్రి.. ప్ర‌జ‌లు కోరితే రాష్ట్రంలో సినిమాని నిషేదిస్తాం

తాజాగా నేడు ఓం రౌత్ ఈ ట్వీట్ సడెన్ గా డిలీట్ చేశాడు. దీంతో నెటిజన్లు మరింత రెచ్చిపోయారు. ముందునుంచే ఓం రౌత్ కి హిందువుల మీద ద్వేషం ఉందని, బాలీవుడ్ వాళ్లంతా ఇంతే అని, అందుకే రామాయణాన్ని ఇలా ఇష్టమొచ్చినట్టు తీశారని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై ఓం రౌత్ ఏమంటాడో చూడాలి.