Harihara Veeramallu : ‘హరిహర వీరమల్లు’ మరోసారి వాయిదా..
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు చిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది.

Once again Pawan Kalyan Harihara Veeramallu post pone
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఇప్పటికే ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడింది. జూన్ 12న ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావించగా మరోసారి నిరాశే ఎదురైంది. హరిహర వీరమల్లు చిత్రం మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియజేసింది.
“అచంచలమైన ఓపిక, నమ్మకంతో ‘హరి హర వీరమల్లు’ సినిమాకు తోడుగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ ప్రేమికులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. గతంలో ప్రకటించిన జూన్ 12వ తేదీకి చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తున్నాము. అయినప్పటికీ ఆ తేదీకి చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురాలేకపోతున్నామని తెలియజేస్తున్నాము. కష్టమైనయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని మరింత గొప్పగా మలచాలని ప్రయత్నిస్తున్నాం. ప్రతి ఫ్రేమ్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. అద్భుతమైన చిత్రంగా మలిచే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాము. అందుకే మేము మరి కొంత సమయం తీసుకుంటున్నాము. మీ ఎదురుచూపులకు బహుమతిగా గొప్ప చిత్రాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నాము.”అని చిత్ర బృందం తెలియజేసింది.
సోషల్ మీడియాలో ఈ చిత్రం గురించి వచ్చే వార్తలు నమ్మవద్దని కోరింది. సినిమాకి సంబంధించిన అన్ని విషయాలను తామే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేస్తామని, కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది.
Mithra Mandali : సోషల్ మీడియా సంచలనం నిహారిక హీరోయిన్‌గా.. నలుగురు స్టార్ కమెడియన్స్‌తో
ఈ చిత్రానికి ఎఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ.ఎం.రత్నం చిత్ర సమర్పకులు గా, ఎ. దయాకర్ రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.