Orange Movie: జపాన్‌లో దుమ్ములేపేందుకు రెడీ అవుతోన్న ఆరెంజ్..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ మూవీని జపాన్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Orange Movie To Release In Japan
Orange Movie: ఆర్ఆర్ఆర్ మూవీతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమాతో చరణ్‌కు ప్రపంచవ్యాప్తంగా సాలిడ్ క్రేజ్ వచ్చింది. ఇక ఈ క్రేజ్‌తో చరణ్ నెక్ట్స్ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తోంది చిత్ర యనిట్. దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ‘గేమ్ చేంజర్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.
Orange Movie: ఆరెంజ్ రీ-రిలీజ్.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో అరుదైన రికార్డు!
అయితే, ఇటీవల చరణ్ నటించిన ‘ఆరెంజ్’ సినిమాను రీ-రిలీజ్ చేయగా, దానికి ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది. ఈ కల్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీకి ప్రేక్షకులు సాలిడ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఇక ఈ సినిమాను ఇప్పుడు జపాన్ దేశంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు హ్యారిస్ జైరాజ్ సంగీతం మేజర్ అసెట్‌గా నిలిచింది. ఈ సినిమాలోని పాటలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలవడంతో, ఈ సినిమాను మళ్లీ చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపుతున్నారు.
Orange Re Release : ఆరెంజ్ రీ రిలీజ్.. నేను విన్నాను, నేను ఉన్నాను అంటున్న నాగబాబు..
కాగా, ఇప్పుడు ఈ సినిమాను జపాన్‌లో మే 6న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి ఈ సినిమాకు జపాన్ ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్‌ను అందిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో అందాల భామ జెనీలియా హీరోయిన్‌గా నటించింది.