Pailam Pilaga : ఓటీటీలో దూసుకుపోతున్న ‘పైలం పిలగా’.. ట్రెండింగ్‌లో..

సాయి తేజ హీరోగా న‌టించిన‌ చిత్రం ‘పైలం పిలగా’.

Pailam Pilaga : ఓటీటీలో దూసుకుపోతున్న ‘పైలం పిలగా’.. ట్రెండింగ్‌లో..

Pailam Pilaga trending in ETV Win app

Updated On : October 26, 2024 / 6:00 PM IST

సాయి తేజ హీరోగా న‌టించిన‌ చిత్రం ‘పైలం పిలగా’. ఆనంద్ గుర్రం ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న‌ ఈ మూవీలో పావ‌ని క‌ర‌ణం హీరోయిన్‌. హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. డబ్బింగ్  జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ ఈ సినిమా సెప్టెంబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.

ఇక అక్టోబ‌ర్ 10 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఈటీవి విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో ఈ చిత్రం దూసుకుపోతుంది. ఓటీటీలో వచ్చే క్రైమ్, హారర్, అడల్ట్ కంటెంట్ కి భిన్నంగా పిల్లలు, పెద్దలు ఫామిలీ అంతా కలిసి కూర్చొని చూసే నీట్ అండ్ క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ఈటీవి విన్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మెలోడియస్ పాటలు, ఆకట్టుకునే డైలాగ్స్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి.

SDT 18 Update : సాయి దుర్గా తేజ్ SDT18 నుంచి సాలీడ్ అప్‌డేట్‌..

క‌థ‌..

తను పుట్టి పెరిగిన ఊళ్లోనే పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసి అంబాని లా ఎదగాలనుకునే ఒక పల్లెటూరి యువకుడి కథ. తన ప్రయాణంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ముఖ్యంగా ప్రభుత్వ అనుమతుల విషయంలో బ్యూరోక్రసీలో ఉండే రూల్స్,  ప్రభుత్వ అధికారుల అలసత్వం, అవినీతి వల్ల విలువైన సమయాన్ని, డబ్బును ఒక దశలో  ప్రేమించిన వాళ్ళు కూడా దూరమై చివరకు తన కుటుంబం, తన ఊరు బాగు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేదే ఈ సినిమా.

Bigg Boss 8 : హౌస్ మేట్స్ కి ఇచ్చిపడేసిన నాగార్జున.. పృథ్విని పై నుండి కిందికి చూస్తూ..