Pakka Commercial : జన్మించడం.. మరణించడం కూడా ఖర్చే.. ‘సిరివెన్నెల’ రాసిన సాంగ్ విన్నారా..

ఈ ప్రపంచంలో ఏదీ ఫ్రీ కాదు.. పుట్టుక నుండి చావు వరకు అంతా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే.. అంతా ‘పక్కా కమర్షియలే’ అంటూ అద్భుతమైన పదాలు రాశారు ‘సిరివెన్నెల’..

Pakka Commercial : జన్మించడం.. మరణించడం కూడా ఖర్చే.. ‘సిరివెన్నెల’ రాసిన సాంగ్ విన్నారా..

Pakka Commercial Title Song

Pakka Commercial: మ్యాచో స్టార్ గోపీచంద్‌, రాశీ ఖన్నా జంటగా.. డిఫరెంట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ద‌ర్శ‌కుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’..
మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో.. జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ బ్యానర్ల మీద బ‌న్నీవాసు నిర్మిస్తున్నారు.

Pakka Commercial : పోస్టర్‌లోనూ మారుతి మార్క్! మే 20న మ్యాచో స్టార్ సినిమా..

గత రెండు రోజులుగా టాలీవుడ్‌లో కొత్త సినిమాల విడుదల తేదీలు ప్రకటిస్తూ ఇటు ఇండస్ట్రీలోనూ అటు ప్రేక్షకాభిమానుల్లోనూ ఫుల్ జోష్ నింపుతున్నారు మేకర్స్. బుధవారం ‘పక్కా కమర్షియల్’ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ‘కరోనా కరుణిస్తే’ అంటూ మే 20న వస్తున్నామని చెప్పారు.

DJ Tillu Trailer : ‘రాధిక ఆప్‌తే.. ఆపకుంటే మాత్రం’? ట్రైలర్ కిరాక్ ఉందిగా!

రీసెంట్‌గా ‘‘సిరివెన్నెల కలం నుండి జాలువారిన మరో అక్షరమాల’’ అంటూ ‘పక్కా కమర్షియల్’ టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. తన పాటలతో తెలుగు సినిమా సాహిత్యానికి సరికొత్త అర్థం చెప్తూ.. సినిమా పాటలకు అందాన్ని, గౌరవాన్ని తీసుకొచ్చిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ పాట రాశారు.

Sehari​ Trailer : ‘ఆలియాను చేసుకోమంటే.. అక్కని తగులుకున్నాడు’.. ట్రైలర్ చూశారా?

ఈ ప్రపంచంలో ఏదీ ఫ్రీ కాదు.. పుట్టుక నుండి చావు వరకు అంతా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే.. అంతా ‘పక్కా కమర్షియలే’ అంటూ అద్భుతమైన పదాలను ఆలోచింపజేసేలా, ఆకట్టుకునేలా రాశారు సిరివెన్నెల. జేక్స్ బిజోయ్ ట్యూన్ కంపోజ్ చేయడంతో పాటు హేమచంద్రతో కలిసి పాడారు.