Prabhas : రాకెట్లా దూసుకెళ్తున్న ప్రభాస్.. లైన్‌లో పెట్టేశాడుగా!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్ వరుసగా కొత్త మూవీలతో దూసుకెళ్తున్నాడు. కొత్త సినిమాలను లైన్లలో పెట్టేసి ఒక్కొక్కటిగా పూర్తిచేసుకుంటూ రాకెట్లా దూసుకెళ్తున్నాడు.

Prabhas : రాకెట్లా దూసుకెళ్తున్న ప్రభాస్.. లైన్‌లో పెట్టేశాడుగా!

Pan India Star Prabhas Upcoming Movie

Updated On : August 28, 2021 / 2:52 PM IST

Pan India Star prabhas Upcoming movie : పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్ వరుసగా కొత్త మూవీలతో దూసుకెళ్తున్నాడు. కొత్త సినిమాలను లైన్లలో పెట్టేసి ఒక్కొక్కటిగా పూర్తిచేసుకుంటూ రాకెట్లా దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు మరో కొత్త మూవీని ప్రభాష్ తన ట్రాక్‌లో పెట్టాడనే టాక్ నడుస్తోంది. ఒకవైపు రాధేశ్యామ్ మూవీని పూర్తి చేసిన వెంటనే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీతో బిజీగా ఉన్నాడు. మరోవైపు ఆదిపురుష్ మూవీ షూటింగ్‌తో బిజీగా గడిపేస్తున్నాడు. అంతేకాదు.. నాగ్ అశ్విన్‌తో సైన్స్ ఫిక్ష‌న్ జోన‌ర్‌ మూవీని కూడా లైన్‌లో పెట్టేశాడు. ఇప్పుడు మరో కొత్త మూవీకి ప్ర‌భాస్ ఓకే చెప్పినట్టు ఇండ‌స్ట్రీ స‌ర్కిల్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

బాలీవుడ్ డైరెక్ట‌ర్ సిద్దార్థ్ ఆనంద్‌తో మూవీకి ప్ర‌భాస్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌నే టాక్ నడుస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్. యాక్ష‌న్ ఓరియెంట్ స్టోరీని ఇప్పటికే సిద్దార్థ్ ఆనంద్ ప్ర‌భాస్‌కు వినిపించినట్టు సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఆ స్టోరీ ప్ర‌భాస్ తెగ నచ్చేసిందట. అందుకే ఆ మూవీకి ప్రభాష్ ఓకే చెప్పేసినట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌లో వ‌న్ ఆఫ్ ది లీడింగ్ బ్యాన‌ర్ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ మూవీని నిర్మించనుంది. ప్ర‌భాస్-సిద్దార్థ్ ఆనంద్ సినిమాకు సంబంధించి ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానుందని బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

ప్ర‌స్తుతం లైన్‌లో ఉన్న మూవీలను ప్రభాస్ కంప్లీట్ చేయాల్సి ఉంది. పూర్తి కాగానే సిద్దార్థ్ ఆనంద్ భారీ స్థాయిలో మూవీని తెరకెక్కించనున్నాడు. ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ మూవీలతో త‌న అభిమానుల‌కు అలరించేందుకు ముందుకు వస్తున్నాడు. సిద్దార్థ్ ఆనంద్ బాలీవుడ్‌లో అంజానా అంజానీ, బ్యాంగ్ బ్యాంగ్, వార్ లాంటి భారీ ప్రాజెక్టులను తెర‌కెక్కించాడు. షారుక్ ఖాన్‌తో ప‌ఠాన్ మూవీతో బిజీగా ఉన్నాడు.